‘హాయ్‌!’.. ‘హాయ్‌ పవర్‌ స్టార్‌’..

Jagadhiswareddy Sad Telugu Love Story - Sakshi

నేను ఆరవ తరగతి కంప్లీట్‌ చేసుకుని ఏడవ తరగతికి స్కూల్‌ మారాను. 2008లో మొదటిసారి స్కూల్లోకి అడుగుపెట్టాను. అలా స్కూల్లోకి అడుగుపెట్టిన మొదటిసారి నేను చూసిన అమ్మాయి తను. 2012లో నా టెన్త్‌ క్లాస్ కంప్లీట్‌ అయ్యేవరకు నేను మాట్లాడలేదు. చివరి రోజు తనతో మాట్లాడిన మాటలు ‘ఎగ్జామ్‌ ఎలా రాశావ్‌?’ అని. తను బాగా రాశానని చెప్పింది. తనను ఆ రెండు మాటలు అడగటానికి చాలా ధైర్యం తెచ్చుకుని వెళ్లాను. నాలో ఉన్న ప్రేమను మాత్రం చెప్పలేకపోయాను. తర్వాత నా పదో తరగతి క్లాస్‌మేట్స్‌తో ఎవరితోనూ నేను టచ్‌లో లేను. నాలుగేళ్ల తర్వాత మా స్కూల్‌ ఫ్రెండ్‌ ‘ఫేస్‌బుక్‌లో తన ఐడీ చూసి రిక్వెస్ట్‌ పంపించు’ అని ఐడియా ఇచ్చాడు. 2011- 2012లో మా స్కూల్‌ రీయూనియన్‌ అయ్యాము.

అలా మళ్లీ తనని కలుసుకున్నా. అప్పుడు కూడా మాట్లాడలేదు.  తన మొబైల్‌ నెంబర్‌ తీసుకుని మా ఫ్రెండ్‌ దగ్గర నుంచి హాయ్‌ అని మెసేజ్‌ చేస్తే తను ఇచ్చిన రిప్లై ఇప్పటికీ మర్చిపోలేను. ‘హాయ్‌ పవర్‌ స్టార్‌’ అని తను రిప్లై ఇచ్చింది. తర్వాత ఓ రెండు నెలలు బాగా మాట్లాడుకున్నాం. నా ప్రేమను ఎలాగైనా తనకు చెప్పాలని మెసేజ్‌ చేశా. తను నా ప్రేమను ఒప్పుకోలేదు. అలా అని ఎవర్నీ ప్రేమించలేదు. అమ్మానాన్న చూసిన అతన్ని చేసుకుంటా అంది. నేను తనకు ఇష్టం లేకపోయినా ప్రేమించు అని బ్యాడ్‌గా బిహేవ్‌ చేశా. తను నాకు దూరమై 3 సంవత్సరాలు గడిచింది.

తను దూరమైన తర్వాత నాకు అర్థమైంది. నేను ప్రేమించటం.. తను నన్ను ప్రేమించాలని అనుకోవటం నా తప్పు. ఇద్దరూ ప్రేమించుకునే అవకాశం దేవుడు కొందరికి మాత్రమే ఇస్తాడు. అలాంటి వాళ్లు చాలా లక్కీ.. తను చెన్నైలో ఉంటుంది. 2017లో వరదలు వచ్చినపుడు తనకోసం వెళ్లాను. ఓ రెండు రోజులు తిరిగాను. తను కనిపించలేదు. తెచ్చుకున్న డబ్బు అయిపోయింది. ఆమె కోసం తీసుకెళ్లిన ఫుడ్‌ అక్కడున్న వాళ్లకు ఇచ్చేశాను. వాళ్లతో కలిసి అక్కడే నేనూ తిన్నాను. తర్వాత తనని నేను కలవలేదు. తను లేదని నేను ఎప్పుడూ బాధపడలేదు! తనెప్పుడూ నాతోనే ఉంది.
- జగదీశ్వర్‌రెడ్డి


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

Read latest Lifestyle News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top