చచ్చేదాకా అతడితోనే లైఫ్‌ అన్నాను | Hindu Muslim 'Telugu' Love Story: Parween, Bharath Happy Ending Love Story | Sakshi
Sakshi News home page

పెళ్లికి ఒప్పుకోలేదు.. కేసు పెట్టారు

Nov 13 2019 10:38 AM | Updated on Nov 13 2019 11:16 AM

Hindu Muslim 'Telugu' Love Story: Parween, Bharath Happy Ending Love Story - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

పోలీస్‌ స్టేషన్‌లో కేసు కూడా పెట్టారు. నేను చచ్చేదాకా తనతోనే లైఫ్‌ అన్నాను...

నేను 2005లో పది పాస్‌ అయ్యాక ఇంటర్‌ కోసమని చిత్తూరు ఎన్‌జీసీలో చేరాను. మొదటి టర్మ్‌ ఎక్షామ్‌ల సమయంలో నా పక్కనే మా సీనియర్‌ కూర్చునేవాడు. తన పేరు భరత్‌! ప్రతి రోజూ నన్ను చూసేవాడు. అంతగా పట్టించుకోలేదు. లాస్ట్‌ డే ఎగ్జామ్‌ రోజు నా దగ్గర స్కేల్‌ అడిగి తీసుకున్నాడు. అందులో ఐలవ్‌యూ అని రాసి ఇచ్చాడు. కొన్ని రోజుల తర్వాత నేను ఒప్పుకున్నాను. చాలా హ్యాపీగా ఉంది అతడితో ఉంటే. అలా ఏడేళ్లు గడిచిపోయాయి. తను బీటెక్‌ చేసి బెంగళూరులో జాబ్‌లో చేరాడు. నేను కడపలో ఎంబీఏ పూర్తి చేశాను. నాకు సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. నేను ముస్లిం, ఓ హిందువును ప్రేమించానంటే ఇంట్లో వాళ్లు ఒప్పుకోరు.

నేను తనకు విషయం చెప్పా. ఒక నెల తర్వాత రిజిస్ట్రర్‌ ఆఫీసులో మా పెళ్లి జరిగింది. పెళ్లైన వెంటనే మేము బెంగళూరు వెళ్లిపోయాం. ఇంట్లో ఎవరూ ఒప్పుకోలేదు. పోలీస్‌ స్టేషన్‌లో కేసు కూడా పెట్టారు. నేను చచ్చేదాకా తనతోనే లైఫ్‌ అన్నాను. అనంతరం  మేము ఇద్దరం నాలుగేళ్లలో జాబ్‌ చేసుకుని సెటిల్‌ అయ్యాం. ఆ తర్వాత మాకో బాబు పుట్టాడు. వాడికి రెండేళ్లు. మా రెండు ఫ్యామిలీలు మమ్మల్ని అంగీకరించాయి. నా సోల్‌మేట్‌తో హ్యాపీగా ఉన్నాను.
- పర్వీన్, చిత్తూరు
చదవండి : ఆమె చేసిన మోసాన్ని లైఫ్‌లాంగ్‌ గుర్తుంచుకుంటా
నలుగురూ చూసి ఏమనుకుంటారో అని..


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement