నా లవ్ గుర్తుకొచ్చిన ప్రతిసారి...

Breakup Love Stories : Shiva Sad Love From Mahabubnagar - Sakshi

ఐటీఐ చదువుతున్న సమయంలో ఓ అమ్మాయి ప్రవర్తన, ముక్కుసూటి తనం నన్ను ఆకర్షించడంతో లవ్‌లో పడ్డాను. మా కులాలు వేరుకావటంతో నేను తనకు నా లవ్‌ గురించి చెప్పలేదు. నా ఫ్యామిలీ ఆర్థిక పరిస్థితి గురించి అలోచించి కూడా వెనకడుగు వేశాను. అలా రెండు సంవత్సరాలు గడిచిపోయాయి. నా చదువు అయిపోయింది. తనను చూసిన ప్రతి సారి నా మనస్సులో తెలియని అలజడి. తనకు మ్యారేజ్‌ అయిన తర్వాత ఇక ఎవరినీ ప్రేమించకూడదని డిసైడ్ అయ్యా. కానీ, నన్ను ఓ అమ్మాయి ప్రేమించటం మొదలుపెట్టింది. ఈసారి మా కులాలు కలిశాయి. 2015లో తను నాకు ప్రపోజ్ చేసింది. తను వరసకు నాకు మేనకోడలు అవుతుంది. వాళ్ల అమ్మ అక్క అవుతుంది. పుట్టినప్పటినుంచి తనను శివగాని పెళ్లాం అనేది వాళ్ల అమ్మ. ‘నా బిడ్డను నీకే ఇస్తా’ అని అందరికీ చెప్పేది. కానీ ఒకే ఊరు కావటం వల్ల, ఆ అమ్మాయిని పుట్టినప్పటి నుంచి చూశాను. కాబట్టి నాకు తను నచ్చేది కాదు. 2015లో తను నాకు ‘మామ ఐ లవ్ యూ’ అని ప్రపోజ్ చేయడంతో నా ఆలోచనలు రివర్స్ అయ్యాయి. నా పరిస్థితిని బట్టి ప్రేమిచడం కన్నా, ప్రేమించబడటం గొప్ప అనుకుని ఓకే అనేశా. తను నేను ఒక్క రోజు కనిపించకపోయినా ఏడ్చేది.

ఇలా 3 సంవత్సరాలు మా ప్రేమ ప్రయాణం సాగింది. వాళ్ల అమ్మ కూడా మాకే సపోర్ట్ కదా అని మేమిద్దరం ప్రేమించుకున్నాం. కానీ, వాళ్ల అమ్మ మనసు మారింది. మా వాళ్లు నన్ను మ్యారేజ్ చేసుకోమని బలవంతం చేశారు. నేను నా మనసులో ఉన్న మాట చెప్పాను. మొదట ఒప్పుకోలేదు! తర్వాత నా పరిస్థితి దృష్ట్యా ఒప్పుకున్నారు. నా కోసం వాళ్ల అమ్మను అడిగారు. వాళ్ల అమ్మ ‘మా ఆయనను అడిగి చెబుతాను’ అన్నది. మేమిద్దరం ప్రేమించుకుంటున్న సంగతి వాళ్ల ఇంట్లో తెల్వదు. తనే చెప్పొద్దంది. నేను తనని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక చెప్పలేదు. అప్పుడు వాళ్ల అమ్మ‘ ఆస్తి లేదు, అమ్మ లేదు. మేము మీకు పిల్లను ఇయ్యం’ అని చెప్పింది. ఈ విషయం మా వాళ్లు నాకు చెబితే నేను తనని అడిగాను.

దానికి తన సమాధానం విని నేను షాక్‌ అయ్యాను. ‘మా వాళ్లకు ఇష్టం లేకపోతే నేను ఏమీ చేయలేను. నువ్వు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకో’ అన్నది. ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. నా ధైర్యం మా పెద్ద అక్క! నాకు అన్నీ తనే. మా పెద్దక్క తర్వాతే ఎవరైనా అనే నమ్మకం. అందుకే ఆ బాధ కూడా నన్ను పెద్దగా ఇబ్బంది పెట్టలేదు. జస్ట్ మూడు నెలల క్రితం తనకు మ్యారేజ్ అయింది. నేను తప్ప మా వాళ్లందరూ తన పెళ్లికి వెళ్లారు. నా ధైర్యం, నిజాయితీ వల్ల లవ్‌లో ఉన్నపుడు ఎటువంటి తప్పూ చేయలేదు. నా ఫ్యామిలీని బాధ పెట్టకూడదని ధైర్యంగా ఉన్నా. ప్రస్తుత సమాజంలో ప్రేమ అనేది ఆస్తులపై ఆధారపడి ఉందని అర్థమైంది????. కొద్ది రోజుల తర్వాత ఓ రోజు ఐటీఐ ఫ్రెండ్ ఒకడు 8 సంవత్సరాల తర్వాత నాకు ఫోన్ చేశాడు. మాటల సందర్భంలో అతడి ప్రేమ గురించి అడిగా. పెళ్లి చేసుకున్నామని చెప్పాడు. ఇద్దరి కులాలు వేరు, వేరు. నేను ఆశ్చర్య పోయా. ఎలా చేసుకున్నారని అడిగా.

‘లవ్ అండ్ అరెంజ్‌డ్‌ మ్యారేజ్’ అన్నాడు. ‘అమ్మాయి వాళ్లు ఎలా ఒప్పుకున్నారు’ అన్నా. ఆ అమ్మాయి 7 సంవత్సరాలు కష్ట పడి పెళ్లికి ఒప్పించిందని చెప్పాడు. నా కళ్లు చెమ్మగిల్లాయి. ఆ అమ్మాయి ఎన్ని కష్టాలు పడి తన ప్రేమని దక్కించుకుందో అని ఆలోచించాను. నా ఫ్రెండ్‌తో మాట్లాడుతూనే ఆలోచించటం మొదలుపెట్టా. రెండు ఫ్యామిలీల సమక్షంలో గుడిలో పెళ్లి జరిగిందని చెప్పాడు. నేను కంగ్రాట్స్ చెబుతూ వారి ఫొటో వాట్సాప్ చేయమన్నా. నా ఫ్రెండ్‌ ఫొటో వాట్సాప్ చేశాడు. నా లవ్ గుర్తుకొచ్చిన ప్రతిసారి మా ఫ్రెండ్ వాళ్ల ఫొటో చూసి అందరు అమ్మాయిలు ఒకేలా ఉండరు. నిజాయితీ పరులు కూడా ఉన్నారు అనుకున్నా.  ఇప్పుడు హ్యాపీగా మ్యారేజ్ సెర్చ్‌లో ఉన్నా. ఇక నా ప్రయత్నం ఆ దేవునికే వదిలేశా.
- శివ, మహబూబ్‌నగర్‌


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

Read latest Lifestyle News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top