సాక్షి, కరీంనగర్: ప్రజలను మోసం చేయడానికి పవన్ కల్యాణ్ జనసేన పార్టీ పెట్టారని ప్రజాసంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం విమర్శించారు. వాస్తవాలు తెలుసుకునేందుకు దమ్ముంటే పవన్ బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.
తెలంగాణ ఉద్యమంలో వందల మంది ప్రాణాలు కోల్పోయి, మరెందరో జైలుకు వెళితే పట్టించుకోని పవన్ కల్యాణ్.. ఇపుడు ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. తెలంగాణ యువతను మభ్యపెట్టడానికి పవన్ యాత్ర చేస్తున్నాడన్నారు. ఈ రాష్ట్రం గురించి మాట్లాడే నైతిక హక్కు పవన్‌కు లేదని తెలిపారు.