మహిళలూ 'ఆ పదాలు' వాడేస్తున్నారు! | Women too posting sexist words on Twitter, says Study | Sakshi
Sakshi News home page

మహిళలూ 'ఆ పదాలు' వాడేస్తున్నారు!

May 28 2016 2:15 PM | Updated on Jul 23 2018 8:49 PM

మహిళలూ 'ఆ పదాలు' వాడేస్తున్నారు! - Sakshi

మహిళలూ 'ఆ పదాలు' వాడేస్తున్నారు!

సోషల్ మీడియా వేదికల్లో పురుషులు మాత్రమే అసభ్యకర పదాలు పోస్టు చేస్తారని మీరు అనుకుంటే పొరబడ్డటే.

న్యూయార్క్‌: సోషల్ మీడియా వేదికల్లో పురుషులు మాత్రమే అసభ్యకర పదాలు పోస్టు చేస్తారని మీరు అనుకుంటే పొరబడ్డటే. మహిళలూ కూడా సాటి మహిళలపై సెక్సీయెస్ట్ కామెంట్స్ చేస్తున్నారట. ట్విట్టర్‌లో దాదాపు సగంమంది మహిళలు ఇలాంటి భాషను ఉపయోగిస్తున్నారని తాజా అధ్యయనంలో పరిశోధకులు కనుగొన్నారు.

బ్రిటిష్‌ మేధో సంస్థ డెమోస్‌ మూడు వారాలపాటు బ్రిటన్‌ లోని  ట్విట్టర్‌ యూజర్ల పోస్టులను విశ్లేషించింది. ఇందులో భాగంగా పురుషులు, మహిళలు చేస్తున్న స్త్రీద్వేషపూరిత వ్యాఖ్యలను అధ్యయనం చేసింది. స్త్రీలను దూషించే పదాలను ఎంత తరచూగా ట్విట్టర్‌ యూజర్లు వాడుతున్నారనే అంశాన్ని పరిశీలించింది. సగటు రెండు లక్షల ట్వీట్లలో స్త్రీలను దూషించే అభ్యంతకర పదాలు వెలువడుతున్నాయని, ఇవి వెలువడిన వెంటనే దాదాపు 80వేల మందికి చేరుతున్నాయని గుర్తించింది. ఈ పరిస్థితి బాధిత మహిళలు ఎదుర్కొంటున్న మానసిక క్షోభకు అద్దం పడుతున్నదని పరిశోధకులు అభిప్రాయపడ్డారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement