మోడల్‌ తలతిక్క పని.. పుట్‌పాత్‌పై వెళుతున్న..

Webcam Model Leaves Girl 15 With Serious Injuries After Throwing Two Car Tyres - Sakshi

మాస్కో :  ఓ వెబ్‌ క్యామ్‌ మోడల్‌ చేసిన తలతిక్క పని 15 ఏళ్ల బాలిక ప్రాణాలమీదకు తెచ్చింది. లైవ్‌లో వీక్షకుల మెప్పు పొందాలన్న మోడల్‌ ప్రయత్నం కారణంగా, ఫుట్‌పాత్‌పై వెళుతున్న బాలిక తలకు తీవ్రగాయమైంది. వివరాల్లోకి వెళితే.. రష్యాలోని మాస్కోకు చెందిన 20 ఏళ్ల విక్టోరియా అనే వెబ్‌ క్యామ్‌ మోడల్‌ తరుచుగా లైవ్‌ చాట్లు చేస్తుంటుంది. ఓ రోజు లైవ్‌ చాట్‌ చేస్తుండగా ఓ వీక్షకుడికి ఆమె ఇంట్లో రెండు కారు టైర్లు కనిపించాయి. దీంతో ఆ వీక్షకుడు వాటి ప్రస్తావన తెచ్చాడు. అవి తన భర్తవని, వాటిని ఎప్పటినుంచో బయటపడేయాలనుకుంటున్నట్లు ఆమె తెల్పింది. ఈ నేపథ్యంలో ఆ రెండు టైర్లను లైవ్‌లో అపార్ట్‌మెంట్‌పై నుంచి కిందపడేయాలని కోరాడు.

అతడి మెప్పు పొందాలన్న భావనతో ఆమె ఏ మాత్రం ఆలోచించకుండా వాటిని ఒక్కొక్కటిగా ఇంటి కిటికిలోనుంచి కిందకు పడేసింది. అయితే అదే సమయంలో విక్టోరియా ఇంటి పక్కగా ఉన్న పుట్‌పాత్‌పై స్కూలుకు వెళుతోన్న ఓ బాలికపై టైర్ పడింది. బాగా ఎత్తుపైనుంచి కారు టైరు బలంగా తలపై పడటంతో బాలిక తలకు తీవ్రగాయమైంది. దీంతో బాలికను వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించి ఓ బాలిక ప్రాణాల మీదకు తెచ్చిన విక్టోరియాపై అక్కడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top