ఫేమస్ పిచ్చితో ఏం చేశాడో తెలుసా..! | Wannabe rapper shoots himself in the FACE to get famous in shocking viral video | Sakshi
Sakshi News home page

ఫేమస్ పిచ్చితో ఏం చేశాడో తెలుసా..!

Jul 26 2016 3:21 PM | Updated on Sep 4 2017 6:24 AM

ఫేమస్ పిచ్చితో ఏం చేశాడో తెలుసా..!

ఫేమస్ పిచ్చితో ఏం చేశాడో తెలుసా..!

ఫేమస్ అవ్వాలనే పిచ్చిలో ఒక్కొక్కరు ఒక్కో విన్యాసం చేస్తుంటారు. అయితే తుపాకీతో కాల్చుకొని ఎవరూ ఫేమస్ అవ్వాలని అనుకోరు.

లండన్: ఫేమస్ అవ్వాలనే పిచ్చిలో ఒక్కొక్కరు ఒక్కో విన్యాసం చేస్తుంటారు. ఆ విన్యాసాలు చేసే క్రమంలో తమ ప్రాణాలు సైతం ఫణంగా పెడతారు. అయితే, తీవ్రమైన బాధ ఉంటుందని తెలిసి ఫేమస్ కోసం ఎవరూ ఏ స్టంట్ చేయలేరు. కానీ, లండన్ లో ఓ వ్యక్తి ఈ వింత కోరిక కోరుకున్నాడు. ప్రజలందరి దృష్టి ఎలాగైన తనపై పడాలన్న ఉద్దేశంతో కాస్పర్ నైట్ అనే వ్యక్తి తనను తాను కాల్చుకున్నాడు. తన చెంపకు గన్ పెట్టి ట్రిగ్గర్ నొక్కి గాయం చేసుకున్నాడు. అనంతరం నోటి నిండా రక్తాన్ని పట్టుకొని బయటకు ఉమ్మేస్తూ ఆ వీడియోను రికార్డు చేసి ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు.

అది కాస్త ఇప్పుడు వైరల్ గా మారింది. త్వరలో తాను మ్యూజిక్ కెరీర్ ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. ఆ మ్యూజిక్ వీడియోలో భాగంగా ఓ స్టంట్ చేయాలని అనుకున్నాడు. అయితే, అతడు ఎవరికీ తెలియదు. తన కెరీర్ కంటే ముందు తాను అందరికీ తెలిసిపోవడం ఎలా అని ఆలోచించి ఈ చెత్త పని చేశాడు. చిన్న సూదితో గుచ్చుకోవాలంటేనే గుండెలు ఎగిసి పడతాయి. అలాంటిది ఏకంగా, చెంపకు తుపాకీ గురిపెట్టి టపీమని కాల్చుకోవడం చేయగలమా.. కానీ అతడు అదే పని చేశాడు. ఓ కెమెరా మెన్ సమక్షంలో ఈ స్టంట్ చేసేందుకు ప్రయత్నించినా రికార్డు చేసేందుకు ఎవరూ ఒప్పుకోలేదంట. దీంతో తన వీడియోను తానే తీసుకుని ఫేస్ బుక్ లో పెట్టాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement