ఎంత పెద్ద ఇసుక తుఫాను

Viral: Huge Sandstorm Strikes Niamey - Sakshi

నియామీ : వందల అడుగుల ఎత్తైన ఇసుక తుఫాను నైజర్‌ దేశ రాజధాని నియామీపై దండెత్తింది.  అక్కడి ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసింది. ఈ సంఘటన సోమవారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. తుఫాను రాకతో వాతవరణంలో విపరీతమైన మార్పులు చోటుచేసుకున్నాయి. తుఫాను ప్రభావంతో నగరంలోని కొన్ని ప్రదేశాలు ఎరుపు, ఆరెంజ్‌ రంగులో దర్శనమిచ్చాయి. అనంతరం నగరం మొత్తం దుమ్మతో నిండిపోయింది. అయితే ఆ వెంటనే వర్షం కురవటంతో పరిస్థితి చక్కబడింది. నియామీలో ఇసుక తుఫాన్లు రావటం కొత్తేమీ కాదు. సహారా ఎడారి కారణంగా అక్కడ తరచుగా తుఫాన్లు వస్తుంటాయి. ( చిలుక నిర్ణయం: యాజమాని‌ షాక్‌! )

జనవరినుంచి ఏప్రిల్‌ మధ్య కాలంలో ఇవి వస్తుంటాయి.  ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. ‘‘ ఇసుక తుఫాను ఎంత భయంకరంగా ఉంది.. అపోకలిప్టో సినిమాలోని ఓ సీన్‌ను తలపిస్తోంది ’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ( ఏటీఎమ్ చోరీకి య‌త్నించిన‌ కోతి )

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top