గ్రీన్‌కార్డుల నిరీక్షణకు తెర?

U.S. House to vote on Republican immigration bill on Wednesday - Sakshi

వాషింగ్టన్‌: ప్రతిభ ఆధారిత వలస విధానం, సరిహద్దు భద్రతల కోసం ఉద్దేశించిన బిల్లుకు అనుకూలంగా ఓటేయాలని అమెరికా చట్టసభల సభ్యులను అధ్యక్షుడు ట్రంప్‌ బుధవారం కోరారు. ప్రస్తుతం గ్రీన్‌కార్డులు పొందేందుకు భారతీయులు సుదీర్ఘకాలం వేచి ఉండాల్సి వస్తుండగా, ఇప్పుడున్న గ్రీన్‌కార్డుల జారీ విధానాన్ని రద్దు చేసి అసలైన అర్హతలు ఉన్న వారికి సరళంగా, వేగంగా గ్రీన్‌కార్డులను ఇచ్చే పద్ధతిని ప్రవేశపెట్టాలన్న ప్రతిపాదన ఈ బిల్లులో ఉంది.

దీంతో భారత్‌ వంటి దేశాల నుంచి అమెరికాకు వెళ్లే ప్రతిభావంతులకు గ్రీన్‌కార్డులు వేగంగా మంజూరయ్యే అవకాశం ఉంటుంది. ‘బిల్లుపై బుధవారం మధ్యాహ్నం (అమెరికా కాలమానం) సభలో ఓటింగ్‌ జరగనుంది. ప్రతిభ, నైపుణ్యాలను పరిగణలోనికి తీసుకుని విదేశీయులకు గ్రీన్‌కార్డు మంజూరు చేయడం, లాటరీ విధానంలో వీసాల జారీ రద్దు, డీఏసీఏ (చిన్నతనంలో వచ్చిన వారిపై చర్యల వాయిదా) పథకం కింద లబ్ధి పొందుతున్న వారికి మరో ఆరేళ్లు అమెరికాలో ఉండేందుకు గడువు పొడిగించడం తదితరాలు ఈ బిల్లులో ఉన్నాయి

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top