ఇరాన్‌ చమురును భారత్‌ కొనుక్కోవచ్చు

US agrees to grant India waiver from Iran oil sanctions - Sakshi

వాషింగ్టన్‌: ఇరాన్‌ నుంచి చమురు కొనుగోలు చేసేందుకు 8 దేశాలకు తాత్కాలికంగా అనుమతిచ్చినట్లు అమెరికా తెలిపింది. ఇరాన్‌ నుంచి ఇప్పటికే చమురు దిగుమతులు గణనీయంగా తగ్గిపోయాయి. ఇంకా కోత విధిస్తే మార్కెట్‌లో ఇంధన ధరలు పెరిగే ముప్పు ఉన్నందునే అమెరికా తన వైఖరిని సడలించినట్లు తెలుస్తోంది. ఇరాన్‌తో లావాదేవీల వ్యవహారంలో ఆంక్షల నుంచి మినహాయింపు పొందిన 8 దేశాల జాబితాలో భారత్, జపాన్, దక్షిణ కొరియా ఉన్నట్లు అమెరికా ఉన్నతాధికారిని ఉటంకిస్తూ బ్లూమ్‌బర్గ్‌ మీడియా సంస్థ వెల్లడించింది. ఇరాన్‌పై తాజా ఆంక్షలు అమల్లోకి వచ్చే నవంబర్‌ 4 నాటికి ఆ దేశం నుంచి చమురు కొనుగోలును పూర్తిగా నిలిపేయాలని అమెరికా ఇది వరకే భారత్‌ సహా పలు దేశాల్ని కోరిన సంగతి తెలిసిందే. ఇరాన్‌ నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో చైనా తరవాత భారత్‌ రెండో స్థానంలో ఉంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top