పాక్ కాల్పుల్లో ఇద్దరి మృతి | Two killed in Pakistani firing | Sakshi
Sakshi News home page

పాక్ కాల్పుల్లో ఇద్దరి మృతి

Aug 24 2014 2:47 AM | Updated on Sep 2 2017 12:20 PM

పాక్ కాల్పుల్లో ఇద్దరి మృతి

పాక్ కాల్పుల్లో ఇద్దరి మృతి

జమ్మూ కాశ్మీర్‌లోని ఆరెస్ పురా, ఆర్నియాల్లో శనివారం పాక్ రేంజర్లు 22 సరిహద్దు సైనిక శిబిరాలు, 13 గ్రామాలపై కవ్వింపు లేకుండానే భారీగా కాల్పులు జరిపి, బాంబులు పేల్చారు.

జమ్మూ:  జమ్మూ కాశ్మీర్‌లోని ఆరెస్ పురా, ఆర్నియాల్లో శనివారం పాక్ రేంజర్లు 22 సరిహద్దు సైనిక శిబిరాలు, 13 గ్రామాలపై  కవ్వింపు లేకుండానే భారీగా కాల్పులు జరిపి,  బాంబులు పేల్చారు. ఇద్దరు భారత పౌరులు మృతిచెందగా ఒక బీఎస్‌ఎఫ్ జవాను సహా ఆరుగురు గాయపడ్డారు. బీఎస్‌ఎఫ్ బలగాలు పాక్ కాల్పులకు దీటుగా బదులు చెప్పాయి. పాక్ జమ్మూ సెక్టార్లో ఈ ఏడాది భారీగా కాల్పులకు దిగడం ఇదే తొలిసారి. గత పక్షం రోజుల్లో కాల్పుల విరమణకు గండికొట్టడం 16వ సారి. ఈ నేపథ్యంలో సరిహద్దు గ్రామాలకు చెందిన మూడు వేలమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement