దోమను చంపినందుకు ట్వీటర్‌ ఖాతా క్లోజ్‌! | Twitter account close to person who killed the Mosquito | Sakshi
Sakshi News home page

దోమను చంపినందుకు ట్వీటర్‌ ఖాతా క్లోజ్‌!

Sep 3 2017 1:21 AM | Updated on Oct 22 2018 6:05 PM

దోమను చంపినందుకు ట్వీటర్‌ ఖాతా క్లోజ్‌! - Sakshi

దోమను చంపినందుకు ట్వీటర్‌ ఖాతా క్లోజ్‌!

హింసను ప్రేరేపించేలా ఉన్న ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో ఉంచితే సంబంధిత ఖాతాలను నిలిపివేస్తామని ట్వీటర్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.

హింసను ప్రేరేపించేలా ఉన్న ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో ఉంచితే సంబంధిత ఖాతాలను నిలిపివేస్తామని ట్వీటర్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. చెప్పినట్లుగానే చనిపోయిన దోమ ఫొటో ట్వీట్‌ చేశాడని ఓ వ్యక్తి ట్వీటర్‌ ఖాతాను సదరు సంస్థ నిలిపివేసింది. ఈ సంఘటన శాన్‌ఫ్రాన్సిస్కోలో జరిగింది. జపాన్‌కి చెందిన ఓ వ్యక్తి శాన్‌ఫ్రాన్సిస్కోలో నివాసముంటున్నాడు. ఆగస్టు 20న అతడు ఇంట్లో టీవీ చూస్తుండగా దోమ కుట్టిందట. ఈ క్రమంలో కోపంతో ఆ దోమను చంపి దాన్ని ఫొటో తీసి ట్వీటర్‌లో ఉంచాడు. ‘నేను టీవీ చూస్తూ విశ్రాంతి తీసుకునే సమయంలో నన్ను కుట్టడానికి ప్రయత్నిస్తావా..! చావు’ అని అతడు ట్వీట్‌ చేశాడు.

ఆ కొద్దిసేపటికే ‘మీ ట్విటర్‌ ఖాతాను తొలగిస్తున్నాం. ఇక నుంచి మీరు ఈ ఖాతాను తెరవలేరు’ అని అతనికి ఓ మెసేజ్‌ వచ్చింది. వెంటనే అతడు ఆగస్టు 26న మరో ట్వీటర్‌ ఖాతాను తెరిచి ‘చంపిన దోమ ఫొటో ట్వీటర్‌లో ఉంచినందుకు నా పాత ఖాతాను పూర్తిగా నిలిపివేశారు. ఇలా చేయడం నిబంధనలకు విరుద్ధమా’ అంటూ ప్రశ్నించాడు. ఈ ట్వీట్‌ ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. 32 వేల మంది రీట్వీట్‌ చేయగా 28 వేల లైక్‌లు వచ్చాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement