భారత్‌కు త్వరలోనే తెలుస్తుంది: ట్రంప్‌

Trump hints at punitive action against India for buying S-400 from Russia - Sakshi

వాషింగ్టన్‌: అధునాతన క్షిపణి వ్యవస్థ ఎస్‌–400 కొనుగోలు కోసం రష్యాతో ఒప్పందం చేసుకున్న భారత్‌కు ఆంక్షల వర్తింపుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నేరుగా సమాధానం ఇవ్వలేదు. శ్వేతసౌధంలో జరిగిన ఓ సమావేశంలో విలేకర్లు ఈ అంశాన్ని లేవనెత్తగా.. ‘భారత్‌కు త్వరలోనే తెలుస్తుంది’ అని అన్నారు. ఎప్పుడు? అని ప్రశ్నించగా.. ‘మీరే చూస్తారుగా.. మీరు ఊహించడానికి ముందే’ అని బదులిచ్చారు.

రష్యా, ఉ.కొరియా, ఇరాన్‌ కంపెనీలతో రక్షణ ఉత్పత్తుల కొనుగోళ్ల లావాదేవీలు నిర్వహించే దేశాలపై ఆంక్షలు విధించడానికి అమెరికా కాట్సా (కౌంటరింగ్‌ అమెరికాస్‌ అడ్వర్సరీస్‌ త్రూ సాంక్షన్స్‌) అనే చట్టాన్ని తెచ్చిన సంగతి తెలిసిందే. ఆంక్షల నుంచి భారత్‌కు మినహాయింపు ఇచ్చేందుకు అమెరికా రక్షణ, విదేశాంగ మంత్రులు జేమ్స్‌ మేటిస్, మైక్‌ పాంపియోలు అనుకూలంగా ఉన్నా అధ్యక్షుడు ట్రంప్‌ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇరాన్‌ నుంచి చమురు దిగుమతులను సున్నా స్థాయికి తగ్గించుకోవాలన్న తమ ఆదేశాలను పాటించని దేశాల సంగతిని తేలుస్తామని ట్రంప్‌ హెచ్చరించారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top