'ట్రంప్ అప్పుడు కూడా స్వలాభం కోసమే' | Trump cashed in on 9/11 terror attacks: Crowley | Sakshi
Sakshi News home page

'ట్రంప్ అప్పుడు కూడా స్వలాభం కోసమే'

Jul 27 2016 2:00 PM | Updated on Aug 25 2018 7:50 PM

'ట్రంప్ అప్పుడు కూడా స్వలాభం కోసమే' - Sakshi

'ట్రంప్ అప్పుడు కూడా స్వలాభం కోసమే'

రిపబ్లికన్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష బరిలో దిగేందుకు సిద్ధంగా ఉన్న డొనాల్డ్ ట్రంప్పై సీనియర్ డెమోక్రటిక్ నాయకుడు క్రోలీ విరుచుకుపడ్డారు.

ఫిలడెల్ఫియా: రిపబ్లికన్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష బరిలో దిగేందుకు సిద్ధంగా ఉన్న డొనాల్డ్ ట్రంప్పై సీనియర్ డెమోక్రటిక్ నాయకుడు క్రోలీ విరుచుకుపడ్డారు. అత్యంత దారుణమైన 9/11 దాడుల సమయంలోనూ ట్రంప్ తన బిజినెస్ గురించి మాత్రమే ఆలోచించాడని క్రోలీ ఆరోపించారు. దాడి జరిగిన అనంతరం నెలలు, సంవత్సరాల వరకు అసలు ట్రంప్ ఎక్కడున్నారని ఆయన ప్రశ్నించారు. దాడిలో తన ప్రాపర్టీస్ ప్రభావితం కాలేదని ట్రంప్ భావించాడని ఆయన విమర్శించారు.

9/11 దాడుల అనంతరం హిల్లరీ క్లింటన్ బాధితుల సహాయానికి కృషి చేసిన విషయాన్ని ఆయన ప్రస్థావించారు. అమెరికాపై దాడి జరిగిన సమయంలో అందరూ దానిని ఒక దుర్దినంగా భావిస్తున్న సమయంలో.. ట్రంప్ మాత్రం దానిని వ్యాపారపరంగానే చూశారని క్రోలీ ఆరోపించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement