కరోనా: ‘నాదియా అన్నం తినడం మానేసింది’

Tiger With Corona Virus Gets Medicines And TLC From Bronx Zoo Keepers - Sakshi

అల్బానీ: న్యూయార్క్‌లోని బ్రాంక్జ్‌ జూలో నాలుగేళ్ల మలయన్‌ పులి నాదియా(పెద్ద పులి)కి కరోనా పాజిటివ్‌ వచ్చిన విషయం తెలిసిందే. దీంతో కరోనా బారిన పడిన తొలి జంతువుగా నాదియాను జూ వైల్డ్‌లైఫ్ కన్జర్వేషన్ సొసైటీ పశువైద్యుడు పాల్‌కాలే ఆదివారం ప్రకటించారు. తాజాగా జూలోని మరో 6 పెద్ద పులులు పోడి దగ్గుతో బాధపడుతున్నట్లు సోమవారం వెల్లడించారు. వాటికి రోగనిరోధక శక్తి మందులు ఇస్తున్నామని, ప్రస్తుతం వాటి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఆయన తెలిపారు. దీనిపై కాలే మాట్లాడుతూ.. ‘ఈ పులులను చూసుకునే సంరక్షకుల ద్వారా కొద్ది మోతాదులో టీఎల్‌సీ, కొన్ని రోగనిరోధక మందులు ఇస్తున్నాము. ప్రస్తుతం ఆ పులుల ఆరోగ్యం మెరుగుపుడుతుంది. అంతేగాక స్వల్ప అనారోగ్యంతో ఉన్న జూలోని మరో 4 పులులకు, 3 సింహాలకు కూడా రోగ నిరోధక ఔషధాలు ఇస్తున్నాము’ అని చెప్పారు. 
(అమెరికాలో పులికీ కరోనా!)

కాగా ‘నాదియా మార్చి మధ్యలో అనారోగ్య బారిన పడింది. ఇక మార్చి 27 నుంచి కరోనా లక్షణాలు దానిలో కనిపించడంతో కోవిడ్‌-19 పరీక్షలు చేయించాం. ఇందుకోసం నాదియా కాలేయం, ముక్కు, గొంతుకు సంబంధించిన శ్వాసనాళాల నుంచి వచ్చే కార్నెల్‌లను పరీక్షల నిమిత్తం న్యూయార్క్‌ పశువైద్యశాల యూనివర్శిటీకి పంపించాం. ఆ పరీక్షల్లో నాదియాకు కోవిడ్‌-19 పాజిటివ్‌ వచ్చింది. ప్రస్తుతం దానినిను ఐసోలేషన్‌లో ఉంచాం. అయితే నాదియా ఇప్పుడు ఆహారం తీసుకోవడం మానేసింది’ అని పాల్‌కాలే అన్నారు. అయితే కరోనా వైరస్‌ జంతువుల నుంచి మనుషులకు సోకే అవకాశం లేదని భావిస్తున్నట్లు చెప్పారు. కాగా హాంకాంగ్‌లోని కొన్ని జంతువులు అనారోగ్యంతో బాధపడుతున్నాయని వాటికి కూడా కరోనా పరీక్షలు జరిగాయని చెప్పారు. వాటికి కరోనా సోకిందా, లేదా అనే విషయం తెలియాల్సి ఉందని చెప్పారు. (కరోనాపై పోరు: డాక్టర్‌ కన్నీటిపర్యంతం)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top