ఒకే ట్రాక్పై హైస్పీడ్ వేగంతో ట్రైన్స్ ఢీ | Three dead, 40 injured in Belgian train crash | Sakshi
Sakshi News home page

ఒకే ట్రాక్పై హైస్పీడ్ వేగంతో ట్రైన్స్ ఢీ

Jun 6 2016 8:55 AM | Updated on Sep 4 2017 1:50 AM

ఒకే ట్రాక్పై హైస్పీడ్ వేగంతో ట్రైన్స్ ఢీ

ఒకే ట్రాక్పై హైస్పీడ్ వేగంతో ట్రైన్స్ ఢీ

బెల్జియంలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న ఓ గూడ్స్ రైలును అదే ట్రాక్ పై హై స్పీడ్ తో వెనుక నుంచి వచ్చిన ఓ ప్యాసింజర్ రైలు బలంగా ఢీకొట్టింది.

బ్రస్సెల్స్: బెల్జియంలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న ఓ గూడ్స్ రైలును అదే ట్రాక్ పై హై స్పీడ్ తో వెనుక నుంచి వచ్చిన ఓ ప్యాసింజర్ రైలు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలుకోల్పోగా 40మందికి పైగా గాయాలపాలయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మొత్తం ఆరు బోగీలతో ప్యాసింజర్ రైలు ఉండగా అందులో రెండు బోగీలు పక్కకు తప్పాయి. అందులో రైలు డ్రైవర్ ఉన్న ఇంజిన్ బోగి పూర్తిగా రివర్స్ తిరిగింది.

అధికారులు తెలిపిన ప్రకారం దేశంలోని తూర్పు ప్రాంతాలైన నాముర్-లీగ్ లను కలిపే రైలు మార్గంపై ఈ ఘటన చోటుచేసుకుంది. గూడ్సు రైలును ఢీకొనె సమయంలో ప్యాసింజర్ రైలు హై స్పీడ్ వేగంతో ఉందని, చాలా భయంకరంగా ప్రమాద దృశ్యం కనిపించిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతం బాధితులను రక్షించే చర్యల్లో అధికారులు మునిగిపోయారు. ఈ రైలు ఢీకొన్న సమయంలో ఓ బాంబు పేలినంత పెద్ద శబ్దం వేసిందంటే ఎంత వేగంతో రైలు ఢీకొట్టిందో అర్థం చేసుకోవచ్చు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement