మోడల్‌ను నోట కరుచుకుపోయింది

Shark Attacked Instagram Model - Sakshi

ఫోటో షూట్‌ కోసం వెళ్లిన ఓ మోడల్‌కు.. భయానక అనుభవం ఎదురైంది. నీటిలో ఫోటోలు దిగుతున్న సమయంలో ఓ షార్క్‌ ఒక్కసారిగా ఆమెపై దాడి చేసింది. ఆమెను నోట కరుచుకుని లోపలికి లాక్కెళ్లేందుకు యత్నించగా.. చివరకు ఎలాగోలా ఆమె ప్రాణాలతో బయటపడింది.

వివరాల్లోకి వెళ్తే.. కాలిఫోర్నియాకు చెందిన 19 ఏళ్ల ఇన్‌స్టాగ్రామ్‌ మోడల్‌ కటరినా ఎల్లె జరుట్‌స్కీ, తన బోయ్‌ఫ్రెండ్‌ ఫ్యామిలీతో సరదాగా బహమాస్‌కు షికారు వెళ్లింది. అక్కడ సముద్రంలో ఫోటో షూట్‌కు సిద్ధమైంది. అయితే కాస్త వెరైటీ ఉండాలన్న ఉద్దేశంతో షార్క్‌లను పెంచే ఎన్‌క్లోజర్‌లోకి దిగింది. ఆమె ప్రియుడి తండ్రి ఆమెను ఫోటోలు తీయటం ప్రారంభించాడు. ఇంతలో ఐదడుగుల షార్క్‌ ఒకటి ఆమె చేతిని నోట కరిచి నీటి అడుగు భాగానికి లాక్కెల్లింది. ఆ దెబ్బకు వణికిపోయిన పెద్దాయన సాయం కోసం కేకలు వేశాడు. అయితే దానిని విడిపించుకుని బయటపడ్డ కటరినా.. వెంటనే ఒడ్డుకు పరిగెత్తింది. హుటాహుటిన ఆమెను ఆస్పత్రికి తరలించగా.. ఆమె భుజంలో షార్ట్‌ పళ్లు బలంగా దిగినట్లు వైద్యులు తెలిపారు. ఇన్‌ఫెక్షన్‌ సోకే ప్రమాదం ఉండటంతో  వైద్యుల సలహా మేరకు ఆమె ప్రత్యేక చికిత్స తీసుకుంటోంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top