4 లక్షలు పలికిన మార్లిన్ మన్రో ఫొటో! | Rare Marilyn Monroe shot sold for 4,250 pounds | Sakshi
Sakshi News home page

4 లక్షలు పలికిన మార్లిన్ మన్రో ఫొటో!

Sep 22 2014 2:19 PM | Updated on Sep 2 2017 1:48 PM

4 లక్షలు పలికిన మార్లిన్ మన్రో ఫొటో!

4 లక్షలు పలికిన మార్లిన్ మన్రో ఫొటో!

శృంగార దేవత మార్లిన్ మన్రో ఫొటోలంటే అభిమానులకు ఎప్పుడైనా క్రేజే.

శృంగార దేవత మార్లిన్ మన్రో ఫొటోలంటే అభిమానులకు ఎప్పుడైనా క్రేజే. అలాంటిది ఆమె అరుదైన ఫొటో అంటే అసలు ఆగుతారా? అసలు సినిమాల్లోకి రాకముందు మార్లిన్ మన్రో తీయించుకున్న ఓ బ్లాక్ అండ్ వైట్ ఫొటోను వేలానికి పెట్టగా.. దానికి ఏకంగా 4 లక్షల రూపాయలకు పైగా ధర పలికింది. 1946లో ఏజెన్సీ ఫొటోగ్రాఫర్ జోసెఫ్ జస్గర్ ఈ ఫొటో తీశారు.

మార్లిన్ మన్రో తొలిసారి మోడలింగ్ చేసినప్పుడు కాలిఫోర్నియాలోని జుమా బీచ్లో ఈ ఫొటో తీసి ఉంటారని భావిస్తున్నారు. దీని ఫొటో మాత్రమే 4 లక్షలు పలకగా.. దాని నెగెటివ్, కాపీరైట్ లాంటివి మరోసారి అమ్మకానికి పెట్టబోతున్నారు. వాటికి రెట్టింపు ధర పలకవచ్చని అంచనా వేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement