డిప్రెషన్‌తో పాకిస్తాన్ మోడల్ ఆత్మహత్య

లాహోర్ : డిప్రెషన్‌తో పాకిస్తాన్ యంగ్ మోడల్ అనం తనోలి (26) ఆత్మహత్య చేసుకుంది. లాహోర్‌లోని తన నివాసంలో ఆమె ఫ్యాన్‌కు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఆమె మరణంతో పాక్ సినీ ప్రముఖులు, మోడల్స్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఇటలీలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్‌ను పూర్తి చేసుకుని రెండు నెలల క్రితమే పాక్‌కు వచ్చిన ఈ యంగ్ మోడల్ మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.
తన ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా నిరాశతో కూడిన పోస్టులు పెట్టినట్లు పేర్కొన్నారు. అయితే ఆమె డిప్రెషన్‌కు కుటుంబ సమస్యలు కారణమా.. కెరీర్ సంబంధించి ఒత్తిడి నెలకుందా అనే విషయం తెలియాల్సి ఉంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్ను పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి