తొలి విదేశీ కేసులో ఎన్‌ఐఏ ఎఫ్‌ఐఆర్‌ | NIA to Probe Afghanistan Gurudwara Terror Attack in First Overseas Case | Sakshi
Sakshi News home page

కాబూల్‌లో ఉగ్రదాడి; ఎన్‌ఐఏ దర్యాప్తు

Apr 2 2020 2:29 PM | Updated on Apr 2 2020 2:42 PM

NIA to Probe Afghanistan Gurudwara Terror Attack in First Overseas Case - Sakshi

కాబూల్‌లోని గురుద్వారా (రాయిటర్స్‌ ఫొటో)

ఇది ఎన్‌ఐఏ దర్యాప్తు తొలి విదేశీ కేసు కావడం విశేషం.

న్యూఢిల్లీ: గత నెలలో ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లో గురుద్వారాపై జరిగిన ఉగ్రవాద దాడి కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) బుధవారం ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసింది. ఇది ఎన్‌ఐఏ దర్యాప్తు చేస్తున్న మొట్ట మొదటి విదేశీ కేసు కావడం విశేషం. ఎన్‌ఐఏ చట్టంలో సవరణ చేయడంతో విదేశాల్లో కేసులను దర్యాప్తు చేసే అధికారం దక్కింది. దీని ప్రకారం భారత్‌ వెలుపల భారతీయులపై ఎటువంటి ఉగ్రవాద దాడులు జరిగినా ఎన్‌ఐఏ దర్యాప్తు చేస్తుంది. అంతేకాదు భారత్‌ ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా జరిగే ఘటనలపైనా ఎన్‌ఐఏ దర్యాప్తు సాగిస్తుంది.

కాగా, మార్చి 25న  గురుద్వారాపై  ఉగ్రవాదులు జరిపిన దాడిలో భారతీయ పౌరుడితో పాటు  27 మంది మృతి చెందారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన ఎన్‌ఐఏ ఐపీసీ, తీవ్రవాద వ్యతిరేక చట్టం కింద కేసు నమోదు చేసింది. ఈ దాడికి పాల్పడింది తామేనని ఐసీస్‌కు చెందిన నిషేధిత తీవ్రవాద సంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌ ఖొరసాన్‌ ప్రావిన్స్‌(ఐఎస్‌కేపీ) ప్రకటించుకుంది. (కుక్కల బోనులో బంధిస్తారు... చితకబాదుతారు!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement