ఆమె కొత్త బాయ్ ఫ్రెండ్కు గాయాలు | Miranda Lambert's boyfriend injured in ski accident | Sakshi
Sakshi News home page

ఆమె కొత్త బాయ్ ఫ్రెండ్కు గాయాలు

Jan 7 2016 2:47 PM | Updated on Sep 3 2017 3:16 PM

ఆమె కొత్త బాయ్ ఫ్రెండ్కు గాయాలు

ఆమె కొత్త బాయ్ ఫ్రెండ్కు గాయాలు

హాలీవుడ్ ప్రముఖ సంగీత గాయని మిరందా లాంబర్ట్ కొత్త బాయ్ ఫ్రెండ్ ఆండర్సన్ ఈస్ట్ (27) గాయపడ్డాడు. కొత్త సంవత్సర వేడుకల్లో భాగంగా వారిద్దరు కలిసి బయటకు వెళ్లినప్పుడు అతడు స్కేటింగ్ చేస్తుండగా అదుపుతప్పి కిందపడటంతో గాయపడ్డాడు.

లాస్ ఎంజెల్స్: హాలీవుడ్ ప్రముఖ సంగీత గాయని మిరందా లాంబర్ట్ కొత్త బాయ్ ఫ్రెండ్ ఆండర్సన్ ఈస్ట్ (27) గాయపడ్డాడు. కొత్త సంవత్సర వేడుకల్లో భాగంగా వారిద్దరు కలిసి బయటకు వెళ్లినప్పుడు అతడు స్కేటింగ్ చేస్తుండగా అదుపుతప్పి కిందపడటంతో గాయపడ్డాడు. దీంతో కొత్త సంవత్సరం వేడుకలకు వారిద్దరు దూరం కావాల్సివచ్చింది. కానీ, ఈ ప్రమాదం మాత్రం వారిద్దరినీ మరింత దగ్గరచేసినట్లు ఆ అమ్మడు మురిసిపోతోంది. గాయపడిన అతడిని స్వయంగా ఆస్పత్రికి తీసుకెళ్లడమేకాకుండా ప్రస్తుతం దగ్గరుండి సపర్యలు చేస్తుందట.

'కొత్త సంవత్సర వేడుకల్లో తన బాయ్ ఫ్రెండ్ ఆండర్సన్ తో కలిసి మిరందా పాల్గొంది. అయితే, స్కేటింగ్ చేస్తుండగా అతడు స్వల్పంగా గాయపడ్డాడు. చిన్నగాయమే అయినప్పటికీ అతడిని ఆమె ఆస్పత్రికి తీసుకెళ్లింది. సేవలు చేస్తోంది. వారు హాలీడే ట్రిప్ ఎంజాయ్ చేయలేకపోయారు. కానీ అంతకంటే ఎక్కువ సంతోషంగా ఉన్నారు. ఆమె స్వయంగా అతడికి సపర్యలు చేస్తూ మురిసిపోతుంది' అని స్థానిక మేగజిన్ ఒకటి పేర్కొంది. ఇంకో ఆసక్తికరమైన విషయమేంటంటే లాంబర్ట్ అతడితో గత నెల రోజుల నుంచే డేటింగ్ చేస్తుందట. కొన్ని విభేదాల కారణంగా ఆమె గాయకుడు బ్లేక్ షెల్టాన్ తో విడిపోయింది. ఆండర్సన్ ఈస్ట్ కూడా ఓ గాయకుడే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement