అబ్బుర‌ప‌రుస్తున్న ఆర్కెస్ట్రా

Lockdown: French Orchestra Virtual Performance Went Viral - Sakshi

పారిస్‌: కరోనా వైరస్‌ విలయతాండవం చేస్తుండటంతో ఫ్రాన్స్‌ ప్రభుత్వం దేశంలో లాక్‌డౌన్‌ విధించింది. దీంతో ఎప్పుడూ తమ సంగీతంతో ప్రేక్షకులను అలరించే నేషనల్‌ ఆర్కెస్ట్రా ఆఫ్‌ ఫ్రెంచ్‌ సభ్యులంతా ఇళ్లకే పరిమితమయ్యారు. కొన్ని రోజులు మాములుగానే గడిపినా.. మళ్లీ తమ సంగీతంతో ప్రజలకు ఓ సందేశాన్ని ఇవ్వాలనుకున్నారు. దాదాపు 50 మంది ఆర్కెస్ట్రా సభ్యులు ఎవరి ఇంట్లో వాళ్లే ఉంటూ ఆన్‌లైన్‌లో తమ సంగీతాన్ని టుగెద‌ర్‌ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అయితే కొంత‌మంది వ్య‌క్తులు మాత్రం స‌మ‌యానికి సంగీత వాయిద్యం అందుబాటులో లేక‌పోవ‌డంతో కిచెన్‌లోని వ‌స్తువుల‌నుప‌యోగించి అబ్బుర‌ప‌రిచారు. ఈ క్ర‌మంలో ఓ వ్య‌క్తి కుర్చీని డ్ర‌మ్‌గా వాడుతూ దానిపై గ‌రిటెల‌తో వాయిస్తున్నాడు.

ప్ర‌స్తుత లాక్‌డౌన్ స‌మ‌యంలో వారు సామాజిక ఎడంతోపాటు, హోమ్ క్వారంటైన్‌ను పాటిస్తూనే మ్యూజిక్‌ ద్వారా ప్ర‌జ‌ల‌కు వినోదాన్ని పంచేందుకు సిద్ధమ‌య్యారు. ప్ర‌జ‌లు లేనిదే తాము లేమ‌ని, అంతేకాక ఇలాంటి సమ‌యంలో ఒక‌రికొక‌రం ఎంతో అవ‌స‌రం అనేది అర్థ‌మ‌వుతోంద‌న్నారు. అందుకే తాము సంగీతాన్ని పంచుకుంటున్నామని ఓ సంగీత‌కారుడు పేర్కొన్నారు. ఈ వీడియోను చిత్రీక‌రించ‌డానికి నాలుగు రోజులు ప‌ట్టింద‌ని తెలిపారు. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారిన‌ ఈ వీడియో అక్క‌డి జ‌నాల మ‌న‌సుల‌ను క‌దిలిస్తోంది. ఆడియో అండ్‌ వీడియో టెక్నాలజీతో అలోన్‌ ఎట్‌ హోమ్‌.. బట్ టుగెద‌ర్‌ ఇన్ ఆన్‌లైన్‌ అంటూ ప్రేక్షకులకు వీనుల‌విందు చేస్తోంది. (లాక్‌డౌన్‌: తండ్రి చివరి చూపు దక్కినా చాలు)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top