ట్రంప్‌ క్లారిటీ ఇచ్చారు.. వాళ్లే తేల్చుకోవాలి | Jerusalem’s final status to be decided by Israelis, Palestinians: US’ Rex Tillerson | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ క్లారిటీ ఇచ్చారు.. వాళ్లే తేల్చుకోవాలి

Dec 9 2017 3:38 PM | Updated on Dec 9 2017 4:34 PM

Jerusalem’s final status to be decided by Israelis, Palestinians: US’ Rex Tillerson - Sakshi

న్యూయార్క్‌ : జెరూసలేం భూభాగ పరిధి, స్థితిగతులపై తుది నిర్ణయం తీసుకోవాల్సింది ఇజ్రాయెల్‌ వాసులు, పాలస్తీనీయన్లు మాత్రమేనని అమెరికా విదేశాంగ మంత్రి రెక్స్‌ టిల్లర్‌సన్‌ అన్నారు. తమ అధ్యక్షుడు కేవలం జెరూసలేం ఇజ్రాయెల్‌ రాజధానిగా గుర్తిస్తున్నామని మాత్రమే చెప్పారని, ఇక దాని పరిధి విషయం వారే తేల్చుకోవాలని అన్నారు. ప్యారిస్‌లో ఫ్రెంచ్‌ విదేశాంగ మంత్రి జీన్‌ యెస్‌ లెడ్రియాన్‌తోపాటు జరిగిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఆయన (డోనాల్డ్‌ ట్రంప్‌) ఇజ్రాయెల్‌ ఫైనల్‌ స్టేటస్‌ విషయంలో చాలా స్పష్టంగా ఉన్నారు. సరిహద్దులువంటి అంశాలను ఆయన ఇరువురి చర్చలకు వదిలేసినట్లు తెలిపారు. ఇద్దరు కలిసి చర్చంచుకొని ఒక నిర్ణయానికి రావొచ్చని అన్నారు. ఇజ్రాయెల్‌ రాజధానిగా జెరూసలేంను గుర్తిస్తున్నామంటూ ట్రంప్‌ ఈ వారంలో ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రకటనతో దాదాపు కొన్ని దశాబ్దాలుగా ఇజ్రాయెల్‌ విషయంలో ఉన్న అమెరికా పాలసీ విధానం మొత్తాన్ని మార్చేశారు.ట్రంప్‌ నిర్ణయం అరబ్ ముస్లి దేశాలకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. యురోపియన్‌ ఖండంలోని కొన్ని దేశాలు కూడా తీవ్రంగా విమర్శించాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement