చెయ్యెత్తితే విమానం ఆగుతుందా!! | Italian couple run onto airport tarmac to stop plane in Malta | Sakshi
Sakshi News home page

చెయ్యెత్తితే విమానం ఆగుతుందా!!

Jun 20 2015 12:12 AM | Updated on Sep 3 2017 4:01 AM

చెయ్యెత్తి విమానం ఆపబోయిన ఇటాలియన్ జంట మ్యాటియో, ఎన్రికా.

చెయ్యెత్తి విమానం ఆపబోయిన ఇటాలియన్ జంట మ్యాటియో, ఎన్రికా.

'చెయ్యెత్తండి.. బస్సు ఎక్కండి' అనే మన ఆర్టీసీ నినాదాన్ని ఆదర్శంగా తీసుకున్నారేమో.. ఎకంగా కదులుతున్న విమానానికి ఎదురెళ్లి 'ఆపండి.. మేం లోపలికి ఎక్కాలి' అంటూ హడావిడిచిచేసింది ఓ ఇటాలియన్ జంట!

వాలెట్టా: 'చెయ్యెత్తండి.. బస్సు ఎక్కండి' అనే మన ఆర్టీసీ నినాదాన్ని ఆదర్శంగా తీసుకున్నారేమో.. ఎకంగా కదులుతున్న విమానానికి ఎదురెళ్లి 'ఆపండి.. మేం లోపలికి ఎక్కాలి' అంటూ హడావిడిచిచేసింది ఓ ఇటాలియన్ జంట! దక్షిణ ఐరోపాలోని ద్వీప దేశం మాల్టాలో బుధవారం చోటుచేసుకున్న ఈ ఘటనకు మాల్టా కోర్టు శుక్రవారం ముగింపు పలికింది. ఇంతకీ ఏం జరిగిందంటే..

మ్యాటియో క్లెమెంటి (26) అనే ఆయన తన గర్ల్  ఫ్రెండ్ ఎన్రికా అపోలోనియా (23)తో కలిసి మాల్టా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు బయలుదేరి ట్రాఫిక్లో చిక్కుకున్నారు. దీంతో వాళ్లు ఎయిర్ పోర్టుకు చేరుకునే సరికి చెక్ఇన్ సహా అన్ని కౌంటర్లు మూసేశారు. అటు చేస్తూ వాళ్లు వెళ్లాల్సిన విమానం అప్పుడే కదులుతోంది. ఇంటికి వెళ్లాలనే దొందర్లో మరేమీ ఆలోచించకుండా సెక్యూరిటీ గర్డుల్ని తోసేసిమరీ మరో గేటు ద్వారా టెర్మినల్లోకి దూసుకెళ్లారు. విమానం ఆపాలంటూ పెలట్కు రకరకాల సంజ్ఞలు చేశారు.

అఫ్కోర్స్ విమానం ఆగకముందే ఆ జంటను తమ అదుపులోకి తీసుకున్నారు సెక్యూరిటీ సిబ్బంది. కేసు కోర్టుకు చేరింది. అసలు ఎందుకలా చేశారు? అన్న జడ్జిగారి ప్రశ్నకు 'కుటుంబంతో కలిసి పుట్టినరోజు జరుపుకోవాలనుకున్నా. ఆ విమానం మిస్ అయితే మళ్లీ 24 గంటల తర్వాతగానీ మరో విమానం లేదు. అందుకే ధైర్యం చేశాం. మాది తప్పయితే క్షమించండి' అని సమాధానమిచ్చారు మ్యాటియో, ఎన్రికా. ఇద్దరికీ కలిపి రెండున్నర వేల డాలర్ల  జరిమానా విధించారు జడ్జిగారు.

Advertisement
Advertisement