భారత్‌కు 5 వేల కోట్ల క్షిపణి వ్యవస్థ

Israel to supply missile defence systems to India - Sakshi

జెరూసలెం: భారత్‌కు అదనంగా దాదాపు రూ.5,683 కోట్ల విలువ చేసే శక్తిమంతమైన బరాక్‌–8 క్షిపణులను ఇజ్రాయెల్‌ అందించబోతోంది. ఈ మేరకు రక్షణ పరికరాలు తయారుచేసే ఇజ్రాయెల్‌కు చెందిన సంస్థతో భారత్‌ ఒప్పందం కుదుర్చుకుంది. భారత నావికాదళానికి బరాక్‌ 8 (ఎస్‌ఏఎం) క్షిపణులను సరఫరా చేయనుందని ఆ సంస్థ ప్రకటించింది. భారత్, ఇజ్రాయెల్‌లు సంయుక్తంగా ఈ క్షిపణి వ్యవస్థను అభివృద్ధిపరిచాయి. రక్షణ రంగంలో భారత్, ఇజ్రాయెల్‌ల బలమైన ద్వైపాక్షిక సంబంధాలున్నాయనేందుకు బరాక్‌–8 క్షిపణి వ్యవస్థ ఓ సంకేతం అని ఇజ్రాయెల్‌ ఏరోస్పేస్‌ ఇండస్ట్రీస్‌ పేర్కొంది. గత కొద్ది సంవత్సరాలుగా ఇరు దేశాల మధ్య రక్షణ ఒప్పందాల విలువ దాదాపు రూ.4 లక్షల కోట్లకు పైగా పెరిగింది. గగన, సముద్ర, భూతలం నుంచి వచ్చే ప్రమాదాలను ఈ క్షిపణి వ్యవస్థ సమర్థంగా ఎదుర్కొంటుంది. ఈ వ్యవస్థలో చాలా ఆధునికమైన వ్యవస్థలను పొందుపరిచారు. డిజిటల్‌ రాడార్, కమాండ్, కంట్రోల్, లాంచర్లు, ఇంటర్‌సెప్టార్లు, డేటా లింక్‌ తదితర ఆధునిక వ్యవస్థలు ఉంటాయి.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top