సిరియాలో ఇజ్రాయెల్‌-ఇరాన్‌ బీభత్సం

Israel And Syria Exchanges Missile Attack On Syrian Bases - Sakshi

సిరియాలోని ఇజ్రాయెల్‌ ఆధీనంలో ప్రాంతంపై 20 క్షిపణులను ప్రయోగించిన ఇరాన్‌

ప్రతిగా డమాస్కస్‌లోని ఇరాన్‌ స్థావరాలపై ఇజ్రాయెల్‌ దాడులు

ఇరాన్‌ అణుఒప్పందం రద్దు కావడంతో యుద్ధం సంభవిస్తోందేమోననే ఆందోళనలు

జెరూసలేం : ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య వైరం ముదిరింది. సిరియాలో ఇజ్రాయెల్‌ ఆధీనంలో ఉన్న గోలన్‌ హైట్స్‌ ప్రాంతంపై బుధవారం అర్ధరాత్రి ఇరాన్‌ వరుసగా 20 క్షిపణులను ప్రయోగించింది. ఈ మేరకు ఇజ్రాయెల్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే, వీటిలో కొన్నింటిని రక్షణ వ్యవస్థ ఐరన్‌ డోమ్‌ ఎయిర్‌ మిస్సైల్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌తో మధ్యలోనే కూల్చేసినట్లు తెలిపింది.

మరికొన్ని మిస్సైల్స్‌ గోలన్‌ ప్రాంతాన్ని తాకయని పేర్కొంది. దాడులకు ప్రతిగా డమాస్కస్‌లోని ఇరాన్‌ సైన్య స్థావరాల్లో డజన్ల కొద్దీ క్షిపణులను ప్రయోగించినట్లు వెల్లడించింది. 2015లో అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, చైనా, జర్మనీ, రష్యాలతో ఇరాన్‌కు అణు ఒప్పందం కుదిరింది. బుధవారం ఈ ఒప్పందం నుంచి అమెరికా తప్పుకుంటున్నట్లు ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఈ దాడులు జరగడం గమనార్హం.

ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో సిరియాలోని ఇరాన్‌ కీలకస్థావరాలు అన్నీ ధ్వంసమయ్యాయి. ఇరుదేశాల మధ్య వైరం మరింత పెరిగి యుద్ధానికి దారి తీస్తుందేమో ఆందోళనలు పెరుగుతున్నాయి.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top