క్లైమేట్‌ స్మార్ట్‌ రైస్‌ : ఆరోగ్యంగా జీవించొచ్చు

IRRI Announces Genome Sequencing of 7 Wild Rice Varieties - Sakshi

లాస్‌ బనోస్‌, మనీలా(ఫిలిప్పీన్స్‌) : ఏడు రకాల అటవీ వరి వంగడాల జన్యువుల ద్వారా కొత్త రకపు వరి విత్తనాల అభివృద్ధి పూర్తయినట్లు అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ(ఐఆర్‌ఆర్‌ఐ) ప్రకటించింది. ఈ విత్తునాల ద్వారా ఉత్పత్తి చేసిన పంటను ఆహారంగా స్వీకరించడం ద్వారా ఆరోగ్యకర జీవనాన్ని సాగించొచ్చని పేర్కొంది.

ఒక్కమాటలో చెప్పాలంటే ఈ వంగడాలను ‘క్లైమేట్‌ స్మార్ట్‌ రైస్‌’ గా పేర్కొనచ్చని తెలిపింది. భూ మండలంపై సంభవించే వాతావరణ మార్పులను తట్టుకుని అధిక ఉత్పత్తిని ఈ వంగడాలు అందజేస్తాయని చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయంపై ఆధారపడుతున్న రైతులకు ఇవి ఎంతగానో ఉపకరిస్తాయని వెల్లడించింది.

చాలా రకాల జీవ, నిర్జీవ సంబంధిత వ్యాధులను ఈ వంగడాలు నిరోధిస్తాయని వెల్లడించింది. ’నేచుర్‌ జెనెటిక్స్‌’ అనే జర్నల్‌లో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ప్రచురితమయ్యాయని తెలిపింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top