తేలియాడే విమానాశ్రయం..! | interestinf japan international airport | Sakshi
Sakshi News home page

తేలియాడే విమానాశ్రయం..!

Feb 23 2014 11:46 PM | Updated on Sep 2 2017 4:01 AM

తేలియాడే విమానాశ్రయం..!

తేలియాడే విమానాశ్రయం..!

ఇది జపాన్‌లోని కన్సాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం. ఒసాకా బేలో కృత్రిమంగా రూపొందించిన ద్వీపంలో దీన్ని నిర్మించారు. 1987లో నిర్మాణం ప్రారంభించి 1994లో పూర్తిచేశారు. తొలుత నాలుగు కిలోమీటర్ల పొడవు, రెండున్నర కిలోమీటర్ల వెడల్పుతో ద్వీపం నిర్మించారు

 ఇది జపాన్‌లోని కన్సాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం. ఒసాకా బేలో కృత్రిమంగా రూపొందించిన ద్వీపంలో దీన్ని నిర్మించారు. 1987లో నిర్మాణం ప్రారంభించి 1994లో పూర్తిచేశారు. తొలుత నాలుగు కిలోమీటర్ల పొడవు, రెండున్నర కిలోమీటర్ల వెడల్పుతో ద్వీపం నిర్మించారు. ముందుగా ఈ మేరకు కాంక్రీట్‌తో సముద్రంలో గోడ కట్టారు. తర్వాత అందులో సముద్ర మట్టం నుంచి 30 మీటర్ల ఎత్తు వరకు కొండ రాళ్లు, మట్టి పోశారు. ఇందుకోసం ఏకంగా మూడు పర్వతాలను తవ్వేశారు. మొత్తమ్మీద దాదాపు పదివేల మంది కార్మికులు మూడేళ్ల పాటు కష్టపడి ఈ ద్వీపాన్ని నిర్మించారు. అనంతరం దానిపై విమానాశ్రయ నిర్మాణాన్ని పూర్తిచేశారు.
 
  అక్కడ నుంచి భూభాగానికి చేరుకోవడం కోసం మూడు కిలోమీటర్ల పొడవున ఓ వంతెన కూడా నిర్మించారు. ఇంజనీరింగ్ అద్భుతానికి ప్రతీకగా నిలిచిన ఈ ఎయిర్‌పోర్ట్‌కు 2001లో అమెరికన్ సొసైట్ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ నుంచి ‘సివిల్ ఇంజనీరింగ్ మాన్యుమెంట్ ఆఫ్ ది మిలీనియం’ అవార్డు కూడా లభించింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement