నేను దొంగను కాదు.. శిక్షను ఎదుర్కొంటా : నవాజ్‌ షరీఫ్‌

I Will Return To Pakistan To Face Prison Says Nawaz Sharif - Sakshi

తీర్పు అనంతరం తొలిసారి స్పందించిన పాక్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీప్‌

శిక్షను ఎదుర్కొడానికి పాక్‌ వస్తా : షరీఫ్‌

ఇస్లామాబాద్‌ : పనామా పేపర్స్‌ కుంభకోణం కేసులో పదేళ్లు జైలు శిక్ష పడిన పాకిస్తాన్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ తీర్పు అనంతరం తొలిసారి స్పందించారు. తాను తప్పించుకొవాడానికి దొంగను కానని, శిక్షను ఎదుర్కొవడానికి పాక్‌ తప్పనిసరి వస్తానని తెలిపారు. పనామా పేపర్స్‌ కేసులో షరీఫ్‌, అతని కుమార్తె మరియం నవాజ్‌కు శిక్షవిధిస్తూ ఇస్లామాబాద్‌లోని ఓ అకౌంటబులిటీ కోర్టు శుక్రవారం తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే.  దీనిపై శనివారం లండన్‌లో ఆయన కుమర్తెతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కోర్టుపై తనకు గౌరవం ఉందని, శిక్షను అనుభవించడానికి తప్పకుండా పాక్‌ వస్తానని పేర్కొన్నారు. తన భార్యకు క్యాన్సర్‌ కారణంగా ప్రస్తుతం లండన్‌లో చికిత్స తీసుకుంటున్నారని, కొంత సమయం తరువాత కోర్టుకు హాజరవుతానని తెలిపారు.

పాకిస్తాన్‌కు వలస పాలన నుంచి విముక్తి లభించినా, దేశ ప్రజలు మాత్రం ఇంకా బానిసత్వంలోనే ఉన్నారని నవాజ్‌ షరీఫ్‌ అన్నారు. పనామా పేపర్స్‌ కుంభకోణంలో షరీఫ్‌ను నిందితుడిగా పేర్కొంటు పాక్‌ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో గత ఏడాది జూలై 25న ప్రధాని పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. జూలై​ 25న దేశ వ్యాప్తంగా జరిగే సార్వత్రిక ఎన్నికలకు షరీఫ్‌, ఆయన కుమార్తె, అల్లుడు దూరంగా ఉండనున్న నేపథ్యంలో ఆయన సోదరుడు షహాబాజ్‌ షరీఫ్‌ పాకిస్తాన్‌ ముస్లిం లీగ్‌ను బాధ్యతలను స్వీకరించనున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top