ప్రమాదానికి కారణమైన వాటర్‌ బాటిల్‌ | How A Water Bottle Led To Scary Ford Car Crash In UK | Sakshi
Sakshi News home page

ప్రమాదానికి కారణమైన వాటర్‌ బాటిల్‌

Jun 17 2018 3:58 PM | Updated on Apr 3 2019 8:03 PM

How A Water Bottle Led To Scary Ford Car Crash In UK - Sakshi

ప్రమాదం జరిగిన ప్రదేశం, బోల్తా పడిన కారు

లండన్‌ ‌: ‘మనం’ సినిమా క్లైమాక్స్‌లో చూసిన యాక్షన్‌ సీన్‌ యూకేలో నిజంగా జరిగింది. ససెక్స్‌ ప్రాంతానికి చెందిన ఓ మహిళ కారులో ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా బ్రేకులు ఫెయిలయ్యాయి. దీంతో ఆ మహిళ ఆందోళనకు గురికాకుండా, ఇతర వాహనాలకు ఇబ్బంది కలగకుండా దగ్గర్లోని గ్యాస్‌ స్టెషన్‌లోని రక్షణ గోడ (సేఫ్టీ మెటల్‌ రాడ్‌)ను ఢీ కోట్టించి కారును ఆపే ప్రయత్రం చేసింది. నియంత్రణ కోల్పోవడంతో కారు బోల్తా పడినప్పటికీ, స్వల్పగాయాలతో బయటపడ్డారు. 

పోలీసులు కథనం ప్రకారం.. ఆ మహిళ చెప్పిన కారణం ప్రకారం కారును పరిశీలించిన ససెక్స్‌ పోలీసులు, బ్రేక్‌లు ఫెయిల్‌ కాలేదని వివరిస్తూ ఓ ఆసక్తికర విషయాన్ని తెలిపారు. కారు బ్రేకు పెడల్‌ కింద వాటర్‌ బాటిల్‌ ఉండటంతో ఆమె ఎంత ప్రయత్నించినా బ్రేక్‌లు పడలేదని, అయినప్పటికీ సమయస్పూర్తితో వ్యవహరించటంతో ఘోర ప్రమాదం నుంచి తప్పించుకుందని తెలిపారు. కారు నడిపేటప్పుడు ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలని పోలీసులు స్థానిక డ్రైవర్లను హెచ్చరించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement