టాక్సీ దారి తప్పితే అలర్ట్‌

Google Maps get test off route alert feature in India - Sakshi

గూగుల్‌ మ్యాప్స్‌లో ఆఫ్‌ రూట్‌ ఫీచర్‌

ప్రత్యేకంగా భారత్‌లోనే

శాన్‌ఫ్రాన్సిస్కో: టాక్సీ డ్రైవర్లు 500 మీటర్లు దాటి రాంగ్‌రూట్‌లో వెళ్తుంటే అలర్ట్‌ చేసేలా గూగుల్‌ మ్యాప్స్‌ నూతన ఫీచర్‌ను సిద్ధం చేస్తోంది. ‘ఆఫ్‌ రూట్‌’గా వ్యవహరిస్తున్న ఈ ఫీచర్‌ను ప్రత్యేకంగా భారత్‌లోనే అందించనున్నారు. చేరాల్సిన గమ్యాన్ని మ్యాప్‌లో నిర్ధారించుకున్న తర్వాత మెనూలోని స్టే సేఫర్‌ అనే ఆప్షన్‌లో ఆఫ్‌ రూట్‌ అలర్ట్‌ అనే ఈ ఫీచర్‌ ఉంటుందని సోమవారం ఎక్స్‌డీఏ డెవలపర్లు తెలిపారు.

టాక్సీ ఎంచుకున్న మార్గంలో కాకుండా వేరే మార్గంలో 500 మీటర్లు దాటిన ప్రతిసారి ఈ ఫీచర్‌ ద్వారా వినియోగదారునికి అలర్ట్‌ వస్తుందని తెలిపారు. అయితే మార్గం తప్పిన టాక్సీకి అక్కడి నుంచి తిరిగి గమ్యానికి కలిపే దారిని మాత్రం ఈ ఫీచర్‌ చూపించలేదని పేర్కొన్నారు. ప్రస్తుతం పరిశీలనలో ఉన్న ఈ ఫీచర్‌ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో గూగుల్‌ ఇంకా ప్రకటించలేదు. బ్రెయిన్‌ లైవ్‌ స్టేటస్, బస్‌ ప్రయాణ సమయం, మిక్స్‌డ్‌ మోడ్‌లో ఆటోరిక్షా పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వంటి నూతన ఫీచర్లను గూగుల్‌ ఇప్పటికే అందుబాటులోకి తెచ్చింది.  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top