జెయింట్‌ గ్రీన్‌ అనకొండ.. వీడియో  వైరల్‌

Giant Anaconda Halts Busy Road in Brazil Video Goes Viral - Sakshi

భారీ సైజులో ఉన్న అనకొండ రోడ్డుపైకి వచ్చింది. దీంతో వాహనదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. మూడు మీటర్ల పొడవు, 30 కిలోల బరువున్న  గ్రీన్‌ అనకొండ ఇటు అటునుంచి రోడ్డును క్రాస్‌ చేసిన వీడియో సోషల్‌ మీడియా ప్లాట్‌ ఫాంలలో తెగ వైరల్‌అవుతోంది. బ్రెజిల్‌లోని పోర్టో వెల్లో వాసులకు ఆ దృశ్యాన్ని చూసే అరుదైన అవకాశం చిక్కింది. 

ప్రపంచంలోనే అతిపెద్ద పాముగా భావించే ఈ గ్రీన్‌ అనకొండ రోడ్డుకు ఒకవైపున వున్న పొదల్లోంచి బయటికొచ్చి, మరోవైపున వున్న పొదల్లోకి  వెళ్లిపోయింది. అలా అది పెద్ద రహదారిని  దాటుతుండటం గమనించిన  కొంతమంది సెల్ఫీలు దిగితే.. ఇంకొంతమంది అలాగే షాక్ అయిపోయి అది రోడ్డు దాటి వెళ్లే వరకూ అలా చూస్తుండిపోయారు. అయితే ఆహారం కోసమే అది అలా రోడ్డుమీదికి వచ్చి వుంటుందని నిపుణులు  భావిస్తున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top