ఎంపీ ప్రసంగం‌.. గొల్లుమన్న పార్లమెంట్‌

Ghana MP Speech Giggle in Parliament - Sakshi

అది ఘనా పార్లమెంట్‌ హౌజ్‌. ఎంపీ ‘జాన్‌ ఫ్రిమ్‌పొంగ్‌ ఓసెయి’ తన సీటులోంచి నిల్చుని నియోజకవర్గంలోని సమస్యల ప్రస్తావన మొదలుపెట్టారు. దశాబ్దాలుగా విద్యుత్‌ కొరత ఎదుర్కుంటున్న గ్రామాల దుస్థితిని వివరించే యత్నం చేశారు. ఈ క్రమంలో కొన్ని గ్రామాల పేర్లను ఆయన చదివి వినిపిస్తుండగా.. సభలో ఒక్కసారిగా నవ్వులు విరబూశాయి. అందుకు వాటి అర్థాలంతా పచ్చి బూతులు కావటమే. ప్రసంగం కొనసాగుతున్నంత టివీ(అకన్‌ కాసా) భాషలో ఆయన తన ప్రసంగం కొనసాగించగా.. ఆంగ్లంలో వాటి అర్థాలు చాలా దారుణమైనవి. దీంతో ఆయన ప్రసంగం సాగినంత సేపు స్పీకర్‌తోపాటు, మహిళ ఎంపీలు, అంతా తలదించుకుని విరగబడి నవ్వారు.

జాన్‌ ప్రసంగం ముగిసిన వెంటనే లేచిన విద్యుత్‌ శాఖా మంత్రి ‘బోయాకై అగ్యార్కో’ హిల్లేరియస్‌ సమాధానం ఇచ్చారు. ‘ వాళ్లకు విద్యుత్‌ సరఫరా చేస్తే రాత్రిపూట చేసే పనులను విఘాతం కలుగుతుందేమో’ అని బదులిచ్చారు. దీంతో సభ మరోసారి నవ్వులు విరబూశాయి. అయితే వెంటనే సీరియస్‌గా మారిపోయిన మంత్రిగారు.. అబిరెమ్‌ నియోజకవర్గానికి విద్యుత్‌ సరఫరా కోసం చేస్తున్న యత్నాలు వివరించటంతో సభ చల్లబడింది. గురువారం హౌజ్‌లో ఈ ఘటన చోటు చేసుకోగా.. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు చక్కర్లు కొడుతోంది.

  • Etwe nim Nyansa - "Vagina is Wise"

  • Kote ye Aboa - "Penis is a Fool"

  • Shua ye Morbor - "Testicles are Sad".   ఇదిలా ఉంటే ఘనాలో ఏళ్లకు పూర్వం కొన్ని తెగలు తమ ఊళ్లకు ఆయా పేర్లను పెట్టుకోగా.. ఇప్పటికీ అవే పేర్లతో చెలామణిలో ఉన్నాయి. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top