నవాజ్‌ షరీఫ్‌కు బెయిల్‌

Former Pakistani PM Sharif granted medical bail - Sakshi

లాహోర్‌: అనారోగ్యంతో బాధపడుతున్న పాక్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌కు కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఆటో ఇమ్యూన్‌ డిజార్డర్‌ వల్ల ఆయన రక్తంలోని ప్లేట్‌లెట్ల సంఖ్య ప్రమాదకర స్థా యికి తగ్గడంతో సోమవా రం రాత్రి ఆయనను నేషనల్‌ అకౌంటబిలిటీ బ్యూ రో(ఎన్‌ఏబీ) కార్యాల యం నుంచి లాహోర్‌లోని సర్వీసెస్‌ ఆసుపత్రికి తరలించారు.

పాకిస్తాన్‌ ముస్లిం లీగ్‌ పార్టీ అధినేత అయిన నవాజ్‌ షరీఫ్‌ అనారోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని తక్షణమే బెయిల్‌ ఇవ్వాలంటూ ఆయన సోదరుడు షాబాజ్‌ పెట్టుకు న్న పిటిషన్‌ను లాహోర్‌ హైకోర్టు శుక్రవారం విచారించింది. అనంతరం రూ.రెండు కోట్ల విలువైన రెండు సొంత పూచీకత్తుతో బెయిల్‌ మంజూరు చేసింది. నగదు అక్రమ చెలామణీ కేసులో షరీఫ్‌ ఎన్‌ఏబీ అదుపులో ఉన్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top