ఈ ఏడాది చివరికల్లా టీకా!

Donald Trump believes there will be a coronavirus vaccine by year end - Sakshi

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వెల్లడి

వ్యాక్సిన్‌పై ప్రపంచవ్యాప్తంగా వంద ప్రయోగాలు

వాషింగ్టన్‌: కోవిడ్‌ టీకా ఈ ఏడాది చివరికల్లా సిద్ధమవుతుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించారు. కరోనా వైరస్‌ చికిత్సకు రెమిడెస్‌విర్‌ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు తమ ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు. ఫాక్స్‌ న్యూస్‌ చానల్‌ నిర్వహించిన టౌన్‌హాల్‌ కార్యక్రమంలో ఆయన చానల్‌ సోషల్‌ మీడియా ద్వారా అందిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు.  ఈ ఏడాది చివరికల్లా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తుందనే అనుకుంటున్నానని చెప్పారు. ఆరోగ్య శాఖ అధికారులు టీకా తయారీకి ఏడాది నుంచి ఏడాదిన్నర సమయం పడుతుందని ప్రకటించినప్పటికీ గత నెలలో వైట్‌హౌస్‌ టాస్క్‌ఫోర్స్‌ సభ్యుడు డాక్టర్‌ ఆంథొనీ ఫాసీ టీకా త్వరగా అందుబాటులోకి వస్తుందని చెప్పిన సంగతి తెలిసిందే.

12 టీకాలు మానవ ప్రయోగాలకు సిద్ధం
కరోనా వైరస్‌ నుంచి రక్షణ కల్పించే టీకాను అభివృద్ధి చేసేందుకు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వంద వరకూ ప్రయోగాలు జరుగుతున్నాయి. వీటిల్లో అమెరికా, చైనా, బ్రిటన్, జర్మనీల్లో కనీసం పన్నెండు టీకాలు మానవ ప్రయోగాలకు సిద్ధంగా ఉన్నాయి. ‘శాస్త్రవేత్తల బృందాలు ఒకరితో ఒకరు పోటీ పడటం లేదు. వైరస్‌ను మట్టుబెట్టేందుకు పోటీపడుతున్నాం. ఈ క్రమంలో మరింత మంది ప్రయోగాలు చేయడం అవసరం కూడా’’అని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో టీకా తయారీకి జరుగుతున్నప్రయత్నాలకు నేతృత్వం వహిస్తున్న డాక్టర్‌ ఆండ్రూ పోలార్డ్‌ తెలిపారు.

చైనాలో ఈ ఏడాది మార్చిలో ప్రయోగాత్మక టీకా ఒకదాన్ని కొంతమందిపై ప్రయోగించి సత్ఫలితాలు రాబట్టారు. ప్రస్తుతం అదే టీకాను విస్తృత స్థాయిలో ప్రయోగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.  జర్మనీలో ప్రఖ్యాత ఫార్మా కంపెనీ ఫైజర్, బయోఎన్‌టెక్‌ అనే సంస్థలు కలిసికట్టుగా గత వారమే 4 వేర్వేరు టీకాలను మానవులపై ప్రయోగించి పరీక్షిస్తున్నాయి. జూలైలోపు మరిన్ని ప్రయోగాత్మక టీకాలపై వివిధ దేశాలు మానవ ప్రయోగాలు నిర్వహించనున్నాయి. కరోనా వైరస్‌లోని ఓ భాగాన్ని రోగ నిరోధక వ్యవస్థ స్వయంగా గుర్తించి మట్టుబెట్టేలా చేసేందుకు మరికొందరు ప్రయత్నాలు చేస్తున్నారు.

చైనాలో మరోసారి కరోనా!
చైనాలో కరోనా వైరస్‌ మరోసారి తిరగబెడుతోందా? అవునని హెచ్చరిస్తున్నారు చైనా ఆరోగ్యశాఖ అధికారులు. దేశంలోని పది ప్రావిన్సుల్లో స్థానికంగా వ్యాప్తి చెందిన కరోనాకేసులు కొన్ని బయటపడ్డాయని జాతీయ ఆరోగ్య కమిషన్‌ అధికార ప్రతినిధి పెంగ్‌ చెప్పారు. తాజాగా వైరస్‌ బారిన పడ్డవారిలో లక్షణాలేవీ కనిపించడం లేదని, దీన్నిబట్టి చైనాలో కరోనా ప్రమాదం ఇంకా పొంచి ఉందనే అనుకోవాలన్నారు. చైనాలో పలు కార్యాలయాలు, వ్యాపారాలు  పనిచేస్తున్నప్పటికీ సినిమా థియేటర్లను మూసే ఉంచారు. ఆదివారం చైనాలో విదేశాల నుంచి తిరిగి వచ్చిన ముగ్గురిలో కోవిడ్‌ లక్షణాలు కనిపించినట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. మొత్తం 952 మంది కోవిడ్‌ బాధితులు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారన్నారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

14-05-2021
May 14, 2021, 16:13 IST
పిల్లల ప్రవర్తనలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి.. మానసిక రుగ్మతలైన....
14-05-2021
May 14, 2021, 15:55 IST
న్యూఢిల్లీ: కరోనా మొదటి దశలో పిల్లల్లో ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. గత ఏడాది పిల్లలు, టీనేజర్లు కరోనా బారిన పడిన...
14-05-2021
May 14, 2021, 14:45 IST
కేయూ క్యాంపస్‌ (వరంగల్‌): పాతికేళ్ల గురు శిష్యుల అనుబంధం వారిది.. అయితే ఆ అనుబంధాన్ని కోవిడ్‌ చిదిమేసింది. కోవిడ్‌ కారణంగా...
14-05-2021
May 14, 2021, 14:40 IST
సాక్షి, హైదరాబాద్‌: దేశంలో రెండో దశలో  రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్న తరుణంలో  ఊరటనిచ్చే సమాచారం స్పుత్నిక్-వీ టీకా స్వీకరణ షురూ కావడం. రెండు...
14-05-2021
May 14, 2021, 14:39 IST
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాక్సిన్‌లు అందుబాటులో లేనప్పుడు టీకా తీసుకోవాలని ప్రజలను కోరడం ఏంటని ఢిల్లీ హైకోర్టు గురువారం ప్రశ్నించింది....
14-05-2021
May 14, 2021, 14:07 IST
డెహ్రాడూన్: భారత్‌లో కరోనా రెండో దశ విరుచుకుపడుతోంది. మహమ్మారి కట్టడికి రాత్రి కర్ఫ్యూ, లాక్‌డౌన్‌ వంటి చర్యలు చేపడుతున్నప్పటికీ కేసుల సంఖ్య...
14-05-2021
May 14, 2021, 13:48 IST
న్యూఢిల్లీ : చిన్నారిని కాపాడేందుకు వాళ్ల కుటుంబం సాయశక్తులా ప్రయత్నించారు. కానీ మాయదారి కరోనా 5నెలల చిన్నారిని కబలించింది. ఆరు రోజులుగా...
14-05-2021
May 14, 2021, 13:07 IST
సాక్షి, న్యూఢిల్లీ: మరికొన్ని రోజుల్లో దేశంలో అందుబాటులోకి రానున్న రష్యా స్పుత్నిక్-వీ కరోనా వ్యాక్సిన్ ధర రూ.995.40గా ఉండనుంది. రష్యానుంచి దిగుమతి చేసుకునే...
14-05-2021
May 14, 2021, 12:12 IST
ఢిల్లీకి చెందిన ఓ 30 సంవత్సరాల యువతి కరోనా కారణంగా తన ప్రాణాలను కోల్పోయింది.
14-05-2021
May 14, 2021, 08:18 IST
భారత జట్టు వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ రిషభ్‌ పంత్‌ కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ తొలి డోసును గురువారం తీసుకున్నాడు.
14-05-2021
May 14, 2021, 05:27 IST
సాక్షి, హైదరాబాద్‌: ప్రస్తుత పరిస్థితుల్లో జ్వరం వచ్చి మూడురోజులు దాటినా తగ్గలేదంటే జాగ్రత్త పడాల్సిందే. ఐదురోజులు దాటితే ప్రమాదానికి దారితీసే...
14-05-2021
May 14, 2021, 05:09 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశ పౌరులకు అందజేస్తున్న కోవిషీల్డ్‌ కోవిడ్‌ టీకా రెండు డోస్‌ల మధ్య కాల వ్యవధిని పెంచుతూ కేంద్ర...
14-05-2021
May 14, 2021, 05:01 IST
న్యూఢిల్లీ: కోవాగ్జిన్‌ టీకా ఫార్ములాను ఇతర సంస్థలకు బదిలీ చేయడానికి తయారీ సంస్థ భారత్‌ బయోటెక్‌ అంగీకరించింది. నీతి ఆయోగ్‌...
14-05-2021
May 14, 2021, 04:49 IST
ఒకవైపు కరోనా కేసులు పెరిగిపోతున్నా... మరోవైపు జపాన్‌ ప్రజలు నిరసనలు చేస్తున్నా... టోక్యో ఒలింపిక్స్‌ క్రీడలు ఆగిపోవని అంతర్జాతీయ ఒలింపిక్‌...
14-05-2021
May 14, 2021, 04:28 IST
హిమాయత్‌నగర్‌: ‘సార్‌.. మా నాన్న చనిపోయేలా ఉన్నాడు. ఆక్సిజన్‌ లెవెల్స్‌ పడిపోతున్నాయి. వెంటనే ఐసీయూలోకి షిఫ్ట్‌ చేయాలని సిస్టర్‌ చెప్పారు....
14-05-2021
May 14, 2021, 04:17 IST
హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వాహన పరిశ్రమకూ కోవిడ్‌–19 దెబ్బ పడింది. తయారీ ప్లాంట్లలో పనిచేస్తున్న ఉద్యోగులు వైరస్‌ బారిన పడడం,...
14-05-2021
May 14, 2021, 03:46 IST
సాక్షి, కడప: ప్రస్తుత కరోనా కష్టకాలంలో బాధితులకు అండగా నిలిచేందుకు భారతి సిమెంట్‌  యాజమాన్యం ముందుకొచ్చింది.  కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీలో...
14-05-2021
May 14, 2021, 03:30 IST
సాక్షి, అమరావతి: కరోనా కట్టడి కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ఇతర రాష్ట్రాలకు దిశా నిర్దేశం చేస్తున్నాయి. దేశంలో...
14-05-2021
May 14, 2021, 03:20 IST
సీఎం వైఎస్‌ జగన్‌ రాసిన లేఖతో కోవాగ్జిన్‌ టెక్నాలజీని బదిలి చేయడానికి కేంద్రం ముందుకు వచ్చింది.
14-05-2021
May 14, 2021, 03:13 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్‌ బాధితులకు అత్యవసరంగా ఆక్సిజన్‌ అందించటాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిత్యం ఒక యజ్ఞంలా నిర్వహిస్తోంది. సగటున...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top