ఆ అద్భుతం జరిగేనా? శరీరాన్ని మారుస్తారా? | Doctor’s Plan for Full-Body Transplants Raises Doubts Even in Daring China | Sakshi
Sakshi News home page

ఆ అద్భుతం జరిగేనా? శరీరాన్ని మారుస్తారా?

Jun 14 2016 2:10 PM | Updated on Apr 3 2019 5:45 PM

ఆ అద్భుతం జరిగేనా? శరీరాన్ని మారుస్తారా? - Sakshi

ఆ అద్భుతం జరిగేనా? శరీరాన్ని మారుస్తారా?

ఆరేళ్ల క్రితం... వాంగ్‌ వాన్‌మింగ్‌ తన స్నేహితుడితో మల్లయుద్ధం చేస్తూ తీవ్రంగా గాయపడ్డాడు. పర్యవసానంగా పక్షవాతం వచ్చి మెడ నుంచి కాలి బొటన వేలి వరకు బాడీ అంతా చచ్చుపడిపోయింది.

బీజింగ్‌: ఆరేళ్ల క్రితం... వాంగ్‌ వాన్‌మింగ్‌ తన స్నేహితుడితో మల్లయుద్ధం చేస్తూ తీవ్రంగా గాయపడ్డాడు. పర్యవసానంగా పక్షవాతం వచ్చి మెడ నుంచి కాలి బొటన వేలి వరకు బాడీ అంతా చచ్చుపడిపోయింది. త్వరలో వైద్య చరిత్రలో ఓ అద్భుతం జరగపోతుందని, చచ్చుపడిపోయిన తన బాడీకి బదులుగా మరో బాడీ వచ్చి చేరుతుందని, తాను తిరిగి ఎప్పటిలాగే లేచి నడవగలనని ఆశిస్తున్నాడు. తల మినహా మొత్తం బాడీ మార్పిడి శస్త్ర చికిత్స కోసం స్వచ్ఛందంగా ముందుకొచ్చిన వ్యక్తులో 62 ఏళ్ల రిటైర్డ్‌ కంపెనీ కార్మికుడు వాంగ్‌ ఒకడు. చైనా ఉత్తరాది నగరమైన హార్బిన్‌ నగరంలోని ఆస్పత్రిలో ఈ అద్భుత ఆపరేషన్‌ కోసం వాంగ్‌ వేయి కన్నులతో ఎదురు చూస్తున్నాడు.

బాడీ ట్రాన్స్‌ప్లాంట్‌ (శరీర మార్పిడి) ఆపరేషన్‌ మాట వినగానే ఇదేమిటంటూ యావత్‌ ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. శాస్త్రవిజ్ఞాన ఆచరణీయ పరిధిని చైనా అతిక్రమించేందుకు ప్రయత్నిస్తోందని, నైతిక విలువల సరిహద్దులను కూడా చెరిపేందుకు సాహసిస్తోందని ప్రపంచవ్యాప్తంగా నిరసన వ్యక్తం అవుతోంది. ప్రస్తుతం బాడీ మార్పిడి అసాధ్యమని, వెన్నుపూసలోని నరాలను కలపడం ఎవరికి సాధ్యమయ్యే విషయం కాదని, అనవసరంగా రోగికి మరణం తప్పదని ప్రపంచంలోని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఎరరెన్ని హెచ్చరికలు చేసినా, విమర్శలు చేసినా బాడీ మార్పిడి ఆపరేషన్‌కు సిద్ధమైన చైనాలోని హార్బిన్‌ మెడికల్‌ యూనివర్శిటీకి చెందిన డాక్టర్‌ రెని జియావోపింగ్‌ మాత్రం వెరవడం లేదు. తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించి తీరుతానని 1999లో అమెరికాలో జరిగిన ప్రపంచ తొలి చేతి మార్పిడి ఆపరేషన్‌లో అసిస్టెంట్‌గా పనిచేసిన డాక్టర్‌ రెన్‌ తెగేసి చెబుతున్నారు. తన పరిశోధనలు ముందుకు వెళుతున్నాయని, ఆపరేషన్‌కు అవసరమైన నిపుణుల బందాన్ని ఏర్పాటు చేసుకుంటున్నానని, అన్నీ సిద్ధమయ్యాక ఆపరేషన్‌ జరిగి తీరుతుందని ఆయన ఓ తాజా ఇంటర్వ్యూలో తెలిపారు.  

రెండు శరీరాల తలలను వేరుచేసి ఒకదానికొకటి మెడ వద్ద కలిపి ఆపరేషన్‌ చేస్తానని, మెడ వద్ద అమర్చిన తల నిలబడేందుకు ఓ ఐరన్‌ ప్లేట్‌ను అమరుస్తానని డాక్టర్‌ రెన్‌ వివరించారు. అందరు అనుమానిస్తున్నట్లుగా వెన్నుపూస అడుగుభాగంలో బయటకొచ్చే నరాల వద్ద జిగురులాంటి పదార్థం ఉంటుందని, దాన్ని అతికించడం కష్టమైన ప్రక్రియనే విషయం తనకు తెలుసునని, వాటిని అతికించే బదులు వాటంతట అవే తిరిగి పెరిగేలా చేస్తానని ఆయన చెప్పారు. వెన్ను పూస చివరలో నరాల న్యూరాన్స్‌ను కలపడం మానవ మాత్రుడితో సాధ్యమయ్యే పనికాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇలాంటి బాడీ మార్పిడి ఆపరేషన్‌కు సిద్ధ పడడం ఎంత తొందరపాటో అంత నిర్లక్ష్య వైఖరని అమెరికాలోని ‘గీజల్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ ఆఫ్‌ డార్ట్‌మౌత్‌ కాలేజ్‌’ న్యూరాలోజి ప్రొఫెసర్‌ డాక్టర్‌ జేమ్స్‌ బెర్నాట్‌ వ్యాఖ్యానించారు. వైద్య విజ్ఞానపరంగా ఇది సాధ్యమయ్యే పనికాదని చైనా ఆరోగ్య శాఖ మాజీ డిప్యూటీ మంత్రి హాంగ్‌ ౖజñ ఫూ అభిప్రాయపడ్డారు. ఇది పూర్తి అనైతికమని, ఒకరి తలకాయను మరొకరికి ఎలా పెడతారని కూడా ఆయన ప్రశ్నించారు. ఇలాంటి వైద్య ప్రయోగాలు నిర్వహించాలనడం చైనా ప్రభుత్వం తాపత్రయమని, అందుకనే వైద్య ప్రయోగాల కోసం చైనా ప్రభుత్వం 294 బిలియన్‌ డాలర్లను కేటాయించిందని విమర్శకులు ఆరోపిస్తున్నారు. చైనా నియంతత్వ పోకడలతో బయటి ప్రపంచం స్పందనలను పట్టించుకోవడం లేదని వారు విమర్శిస్తున్నారు.

తలలు మార్చడం, బాడీలు మార్చడం లాంటి ఆపరేషన్లు నిర్వహించానుకోవడం ప్రపంచంలో డాక్టర్‌ రెన్‌ ఒక్కరికి మాత్రమేనున్న ఆలోచన కాదు. ఇటలీలోని టురిన్‌ అడ్వాన్స్‌డ్‌ న్యూరో మాడ్యులేషన్‌ గ్రూపునకు చెందిన డాక్టర్‌ సెర్జియో కానవెరో, రష్యా అకాడమిక్‌ సైన్సెస్‌లోని ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ థియోరిటికల్‌ అండ్‌ ఎక్స్‌పరమెంటల్‌ బయోఫిజిక్స్‌ నిపుణుల బందానికి కూడా ఉన్నాయి.

అయితే వారంతా డాక్టర్‌ రెన్‌ అంత ముందుకు వెళ్లలేదు. డాక్టర్‌ రెన్‌ మాత్రం ఎవరెన్ని విమర్శలు చేసినా పట్టించుకోకుండా ముందుకు వెళుతున్నారు. ఆయన ఇప్పటికే ఎలుకలపై ఈ ప్రయోగం నిర్వహించారు. అవి ఒక్కరోజు మాత్రమే బతికాయి. ఇప్పుడు ఆయన శవాలపై ఈ ప్రయోగాలు నిర్వహిస్తున్నారు. వాటికి సంబంధించిన వివరాలు మాత్రం ఆయన వెల్లడించడం లేదు. ఏదైమైనా ఒళ్లంత చచ్చుబడిపోయిన వాంగ్‌ వాన్‌మింగ్‌ మాత్రం తక కొత్త జీవితం కోసం, వైద్యరంగంలో జరగబోయే అద్భుతం కోసం నిరీక్షిస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement