వాళ్లబ్బాయి గిటార్ నేర్చుకుంటున్నాడట! | David Beckham's son learning guitar | Sakshi
Sakshi News home page

వాళ్లబ్బాయి గిటార్ నేర్చుకుంటున్నాడట!

Sep 1 2016 8:59 AM | Updated on Sep 4 2017 11:52 AM

వాళ్లబ్బాయి గిటార్ నేర్చుకుంటున్నాడట!

వాళ్లబ్బాయి గిటార్ నేర్చుకుంటున్నాడట!

ప్రముఖ మాజీ ఫుట్ బాల్ స్టార్ డేవిడ్ బెకామ్, విక్టోరియా బెకామ్ల ముద్దుల తనయుడు క్రుజ్ బెకామ్ గిటార్ నేర్చుకుంటున్నాడట.

లండన్: ప్రముఖ మాజీ ఫుట్ బాల్ స్టార్ డేవిడ్ బెకామ్, విక్టోరియా బెకామ్ల ముద్దుల తనయుడు క్రుజ్ బెకామ్ గిటార్ నేర్చుకుంటున్నాడట. పాప్ మ్యూజిక్లో ఓ వెలుగు వెలగాలన్న లక్ష్యంతోనే అతడు కఠోరంగా శ్రమిస్తూ గిటార్ నేర్చుకుంటున్నట్లు బ్రిటన్లోని ఓ మేగజిన్ వెల్లడించింది. 'క్రుజ్ మంచి గాయకుడిగా మారాలని అనుకుంటున్నాడు.

అందులో భాగంగా సంగీతంలో గిటార్ విభాగంలో పట్టు సంపాదిస్తున్నాడు. క్రుజ్కు పుట్టుకతోనే సంగీతంతో సంబంధం ఏర్పడింది. అందుకే గిటార్ నేర్చుకుంటున్నాడు. ఇందుకోసం ఇప్పటికే కొన్ని నెలల నుంచి ప్రత్యేక శిక్షణ తరగతులకు వెళుతున్నాడు' అని ఆ మేగజిన్ వెల్లడించింది. క్రుజ్ తల్లి విక్టోరియా బెకామ్ కూడా ఒకప్పుడు గాయని. ఆమె ఆ రంగాన్ని వదిలేసి ఇప్పుడు డిజైనర్గా పనిచేస్తోంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement