‘చిత్ర’హింస.. | Chinese Dad Stranded in Korea after Son Doodles on His Passport | Sakshi
Sakshi News home page

‘చిత్ర’హింస..

Jun 10 2014 1:31 AM | Updated on Sep 2 2017 8:33 AM

మన బుడ్డోడు బొమ్మలేస్తే ఎంతో మురిసిపోతాం.. అందరికీ చూపించి.. గర్వంగా ఫీలైపోతాం. ఇదే టైపులో చైనాలోని షెన్‌యాంగ్ సిటీకి చెందిన జాంగ్ వాళ్లబ్బాయి(4) కూడా మస్తుగా బొమ్మలేస్తాడు.

మన బుడ్డోడు బొమ్మలేస్తే ఎంతో మురిసిపోతాం.. అందరికీ చూపించి.. గర్వంగా ఫీలైపోతాం. ఇదే టైపులో చైనాలోని షెన్‌యాంగ్ సిటీకి చెందిన జాంగ్ వాళ్లబ్బాయి(4) కూడా మస్తుగా బొమ్మలేస్తాడు. ఆ బొమ్మలంటే జాంగ్‌కు ఎంతిష్టమో.. ఇటీవల అక్కడి స్థానిక ఆస్పత్రివారు తండ్రీకొడుకుల బంధం బలోపేతం కోసం ఓ ప్రోగ్రాం పెట్టారు. బహుమతిగా దక్షిణ కొరియా ట్రిప్ అని ప్రకటించారు. జాంగ్ గెలిచాడు. కొడుకుతో కలిసి ఫ్లైటెక్కాడు. తన పుత్ర రత్నానికి ఇష్టమైన డ్రాయింగ్ బుక్, స్కెచ్ పెన్లను మరిచిపోకుండా.. బ్యాగులో సర్దిపెట్టాడు. వారు దక్షిణ కొరియాలో దిగారు.
 
 కొన్ని ప్రాంతాలు తిరిగారు. ఇటు జాంగ్ పుత్ర రత్నం ఖాలీ టైంలో బొమ్మలు గీసుకోవడం మొదలుపెట్టాడు. డ్రాయింగ్ బుక్ పూర్తయిపోయింది. ఏం చేయాలా అని ఆలోచించాడు. నాన్న పాస్‌పోర్టు బుక్ కనిపించింది. అక్కడ తన టాలెంట్ చూపించాడు. అయితే, ఆ టాలెంట్ దక్షిణ కొరియా ఇమ్మిగ్రేషన్ అధికారులకు నచ్చలేదు. ఇంతగా ‘చిత్ర’హింసకు గురైన పాస్‌పోర్టు చెల్లదని చెబుతూ.. జాంగ్ తిరిగి చైనా ఫ్లైటెక్కడానికి వీల్లేదన్నారు. దీంతో కొత్త పాస్‌పోర్టు కోసం స్థానిక ఎంబసీ చుట్టూ తిరిగి తిరిగి.. కొత్తది రావడంతో ఈ మధ్యే  జాంగ్.. తిరిగి చైనా విమానమెక్కాడట.

Advertisement
Advertisement