కెమెరాకు చిక్కిన ఆకాశంలో అద్భుతం! | Caught on camera, Blazing meteor lights up the New England sky | Sakshi
Sakshi News home page

కెమెరాకు చిక్కిన ఆకాశంలో అద్భుతం!

May 18 2016 11:48 AM | Updated on Oct 16 2018 4:56 PM

కెమెరాకు చిక్కిన ఆకాశంలో అద్భుతం! - Sakshi

కెమెరాకు చిక్కిన ఆకాశంలో అద్భుతం!

మంగళవారం అర్ధరాత్రి 12.50 గంటల సమయం. ఇద్దరు పోలీసు అధికారులు మాట్లాడుకుంటున్నారు.

మంగళవారం అర్ధరాత్రి 12.50 గంటల సమయం. ఇద్దరు పోలీసు అధికారులు మాట్లాడుకుంటున్నారు. ఇంతలో దూరంగా స్పీడ్‌గా వెళుతున్న వాహనాల్ని చిత్రీకరించడానికి వారిలో ఒకతను తన డాష్‌బోర్డు కెమెరా తీసి అటువైపు తిప్పాడు. ఇంతలో ఆకాశంలో అద్భుతం. నిప్పులు చిమ్ముతూ అగ్నిగోళాలు విశ్వం నుంచి భూమివైపుగా రాలిపడ్డాయి. దీంతో వెలువడిన ప్రకాశవంతమైన మెరుపు చాలా స్పష్టంగా కెమెరాలో చిక్కింది. అమెరికాలో, కెనడాలోని కొన్ని ప్రాంతాల్లో ఈ అద్భుతం కనిపించింది. బహుశా ఒక ఉల్క రాలిపడిపోతూ భూ ఆవరణం సమీపంగా వచ్చి ఉంటుందని అంతరిక్ష నిపుణులు చెప్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement