న్యాయం జరక్కపోతే.. శాంతి లేదు

Black Lives Matter Campaign Children Viral Video - Sakshi

న్యూయార్క్‌ : నల్లజాతీయుడు జార్జ్‌ ఫ్లాయిడ్‌ ఉదంతంతో అగ్రరాజ్యం అట్టుడుకుతోంది. జాతి వివక్షను నిరసిస్తూ దేశవ్యాప్తంగా జనం పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మనసును టచ్‌ చేసే చిత్రాలు, వీడియోలు సోషల్‌ మీడియా వైరల్‌గా మారుతూనే ఉన్నాయి. తాజాగా నిరసనల్లో పాల్గొన్న చిన్నారులకు సంబంధించిన వీడియోలు రెండు వైరల్‌గా మారాయి. ( జార్జ్ ఫ్లాయిడ్ ఉదంతం మ‌ర‌వ‌క‌ముందే..)

‘న్యాయం జరక్కపోతే.. శాంతి ఉండదు’
‘న్యాయం జరక్కపోతే.. శాంతి ఉండదు’ అంటూ ఓ చిన్నారి నినాదాలు చేయటం నెట్టింట చక్కర్లు కొడుతోంది. స్కాట్‌ బ్రిన్‌టన్‌ అనే వ్యక్తి తన ట్విటర్‌ ఖాతాలో ఈ వీడియోను షేర్‌ చేశారు. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ ఉద్యమ భవిష్యత్తు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం సున్నితమైన ఉద్యమంలో చిన్నారి పాల్గొనటాన్ని తప్పుబడుతున్నారు. హక్కుల కోసం పోరాడుతూ బాల్యాన్ని వృధా చేసుకోవటం మంచిది కాదని హితవు పలుకుతున్నారు. 

‘నువ్వు మమ్మల్ని కాలుస్తావా?’
శుక్రవారం హూస్టన్‌ రోడ్డుపై జరిగిన నిరసన కార్యక్రమంలో తల్లితో పాటు నడుస్తున్న ఓ చిన్నారి ఏడుస్తోంది. అది గమనించిన ఓ పోలీసు చిన్నారి దగ్గరకు వెళ్లాడు. ఈ నేపథ్యంలో ఆ చిన్నారి ‘నువ్వు మమ్మల్ని కాలుస్తావా?’ అంటూ ఆ పోలీసును అడిగింది. దీంతో ఆశ్చర్యపోయిన పోలీసు చిన్నారిని దగ్గరకు తీసుకున్నాడు. అలా ఏం జరగదని చిన్నారికి హామీ ఇచ్చాడు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top