
కలకలం రేపిన పాక్ జెండా!
బిహార్‌లోని నలంద జిల్లాలో ఓ ఇంటిపై పాకిస్తాన్ జాతీయ జెండాను పోలిన జెండా ఒకటి ఎగురవేశారన్న వార్త జిల్లా యంత్రాంగాన్ని కలవరపాటుకు గురిచేసింది.
నలంద: బిహార్‌లోని నలంద జిల్లాలో ఓ ఇంటిపై పాకిస్తాన్ జాతీయ జెండాను పోలిన జెండా ఒకటి ఎగురవేశారన్న వార్త జిల్లా యంత్రాంగాన్ని కలవరపాటుకు గురిచేసింది. ఇక్కడి బిహారిషరీఫ్‌లోని ఖరాడీ కాలనీలో నివాసముండే అన్వరుల్ హక్ ఇంటిపై చంద్ర వంక తో కూడిన పచ్చ జెండా రెపరెపలాడుతున్నట్లు స్థానిక టీవీ చానళ్లలో ప్రసారమైంది. దీంతో డీఎస్పీ రెహ్మాన్ అక్కడికి చేరుకున్నారు. ఆలోపే ఆ కుటుంబం జెండాను తొలగించింది. తరువాత అధికారులు దాన్ని స్వాధీనం చేసుకున్నారు. సదరు జెండా పాక్‌దేనా? కాదా? అన్న విషయంపై దర్యాప్తు జరుగుతోందని అధికారులు చెప్పారు. గత ఐదేళ్లుగా మొహర్రం సందర్భంగా ఇలా జెండా ఎగురవేస్తున్నట్లు హక్ కూతురు షబ్నా చెప్పింది.