పార్క్లో సింహం దాడి.. మహిళ మృతి | American woman killed in lion attack in South African park | Sakshi
Sakshi News home page

పార్క్లో సింహం దాడి.. మహిళ మృతి

Jun 2 2015 3:01 PM | Updated on Sep 3 2017 3:07 AM

పార్క్లో సింహం దాడి.. మహిళ మృతి

పార్క్లో సింహం దాడి.. మహిళ మృతి

సరదాగా పార్క్కు వెళ్లిన యువతి ఆకస్మికంగా సింహం బారినపడి ప్రాణాలు కోల్పోగా, మరో వ్యక్తి గాయపడ్డారు.

జొహాన్నెస్బర్గ్: విహార యాత్ర విషాదంగా మారింది. సరదాగా పార్క్కు వెళ్లిన యువతి ఆకస్మికంగా సింహం బారినపడి ప్రాణాలు కోల్పోగా, మరో వ్యక్తి గాయపడ్డారు.

దక్షిణాఫ్రికాలోని జొహాన్నెస్బర్గ్లోని వన్యప్రాణుల పార్క్ చూసేందుకు ఓ అమెరికా యువతి వెళ్లింది. ఈ పార్క్లో సింహాలను బంధించకుండా స్వేచ్చగా వదిలేస్తారు. కార్లు, ఇతర వాహానాలలో వెళ్లి వీటిని చూడవచ్చు. అమెరికా యువతి కారులో వెళ్లి సింహాలను చూస్తూ సరదగా ఫొటోలు తీయసాగింది. కాగా ఆ సమయంలో కారు అద్దాలు వేసుకోకపోవడంతో సింహం దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. ఆమెను రక్షించేందుకు కారు డ్రైవర్ ప్రయత్నించగా అతణ్ని కాలి గోళ్లతో గాయపరిచింది. పార్క్ సిబ్బంది వెంటనే అప్రమత్తమై సింహాన్ని అక్కడి నుంచి దరిమేశారు. వెంటనే అంబులెన్స్లో వారిని ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన అమెరికా యువతి చనిపోగా, డ్రైవర్ చికిత్స పొందతున్నాడు. పార్క్ తిలకించేందుకు వచ్చేవారికి తగిన జాగ్రత్తలు తెలియజేస్తామని, కారు అద్దాలు వేసుకోకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని పార్క్ సిబ్బంది చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement