ఫోన్‌లో మునిగి.. ఆ యువతి ఏం చేసిందో తెలుసా? | Woman Falls In Front Of Train By Speaking In Phone In Madrid | Sakshi
Sakshi News home page

ఫోన్‌లో మునిగి.. పట్టాలపై పడి..

Nov 2 2019 5:25 AM | Updated on Nov 2 2019 9:20 AM

Woman on phone slips and falls in front of train - Sakshi

పట్టాలపై పడబోతున్న యువతి(వృత్తంలో)

మ్యాడ్రిడ్‌: స్మార్ట్‌ఫోన్‌ చేతిలో ఉంటే ప్రపంచాన్ని మరిచిపోతాం అనేందుకు తాజా ఉదాహరణ ఇది. స్పెయిన్‌ రాజధాని మ్యాడ్రిడ్‌లోని ఓ రైల్వే స్టేషన్‌లో రైలు కోసం కూర్చున్న ఓ యువతి స్మార్ట్‌ఫోన్‌లో మునిగితేలుతోంది. ఇంతలో రైలు స్టేషన్‌లోకి రావడంతో ఆ యువతి ముందుకు అడుగులు వేసింది. రైలు ఇంకా రాకమునుపే.. రైలు ఎక్కే ప్రయత్నం చేసింది. దీంతో రైలు పట్టాలపై పడిపోయింది. ప్రస్తుతం ఈ ఘటన  వీడియో వైరల్‌ అయింది. వీడియో ఆమె పట్టాలపై పడినంత వరకే ఉండటంతో తనకు ఏమైందా అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. దీనిపై అధికారులు ట్విటర్‌లో స్పందిస్తూ.. స్వల్ప గాయాలతో సదరు యువతి బయటపడినట్లు వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement