చైనాలో కరోనా వ్యాక్సిన్‌ ట్రయల్స్‌ !

5000 volunteers sign up for coronavirus vaccine trial in Wuhan - Sakshi

5 వేల మంది నమోదు

బీజింగ్‌: చైనాలో కరోనాకు వ్యాక్సిన్‌ కనిపెట్టారా ? చైనాలో జరుగుతున్న ఔషధ పరీక్షలను చూస్తే అలాగే కనిపిస్తోంది. శాస్త్రవేత్తలు పలు ప్రయోగాల అనంతరం కనిపెట్టిన ఓ వ్యాక్సిన్‌ను పరీక్షించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ వ్యాక్సినేషన్‌ను పలు దశల్లో చేపట్టనుండగా, మొదటి దశకోసం ఏకంగా 5 వేల మంది ప్రజలు స్వచ్ఛందంగా రిజిస్టర్‌ చేసుకున్నారని బీజింగ్‌ న్యూస్‌ తెలిపింది. దీన్ని ఓపెన్‌ అండ్‌ డోస్‌ ఎస్కలేషన్‌ దశ–1గా పిలుస్తున్నారు. (రానున్న మూడు వారాలే అత్యంత కీలకం)

ఆరోగ్యంగా ఉండి 18–60 ఏళ్ల వయసు ఉన్న వారికి ఈ వ్యాక్సిన్‌ ఇవ్వనున్నారు. దీనికోసం చైనాలోని అకాడెమీ ఆఫ్‌ మిలిటరీ మెడికల్‌ సైన్సెస్‌ నిపుణులు దీనికి అవసరమైన అనుమతులను ఈ నెల 16నే పొందారు. దాదాపు ఆరు నెలల పాటు ఈ పరిశోధన సాగనున్నట్లు తెలిపారు. వైరస్‌ వల్ల ప్రభావితమైన హుబే ప్రావిన్స్‌లోని వుహాన్‌లోనే ఈ ట్రయల్‌ను సాగించనున్నారు. వ్యాక్సిన్‌ పొందిన వారిని 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచి, వారి ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలించనున్నారు.  (చైనా దాస్తోంది: పాంపియో )

అయిదు మార్గాల్లో..
కోవిడ్‌–19ను ఎదుర్కొనేందుకు చైనా శాస్త్రవేత్తలు అయిదు ప్రత్యేక వ్యాక్సిన్‌ మార్గాల ద్వారా ప్రయత్నాలు చేయనున్నారు. అందులో ఇన్‌ యాక్టివేటెడ్‌ వ్యాక్సిన్లు, జెనెటిక్‌ ఇంజినీరింగ్‌ సబ్‌యూనిట్‌ వ్యాక్సిన్లు, అడెనోవైరస్‌ వెక్టార్‌ వ్యాక్సిన్లు, న్యూక్లియిక్‌ యాసిడ్‌ వ్యాక్సిన్లు్ల, వెక్టార్లుగా అటెన్యెయేటెడ్‌ ఇన్‌ఫ్లూయంజా వైరస్‌ వ్యాక్సిన్లును ఉపయోగించనున్నారు. ఏప్రిల్‌ కల్లా ప్రీ–క్లినికల్‌ దశలను పూర్తి చేసుకునే అవకాశం ఉందని పరిశోధనలో పాల్గొన్న నిపుణుడు వాంగ్‌ జుంఝి తెలిపారు. వ్యాక్సిన్‌ పరిశోధనల్లో ఇతర దేశాల కంటే తామేమీ వెనుకబడలేదని, శాస్త్రీయమైన, కచ్చితమైన మార్గాల్లో పరిశోధనలు సాగుతున్నాయని చెప్పారు. (అందరూ త్యాగాలు చేయాల్సిందే!)

చైనాలోని జియంగ్సు ప్రావిన్స్‌లో ఉన్న ఓ పార్క్‌లో కరోనా వైరస్‌ సోకకుండా టెంటు వేసుకొని విందు ఆరగిస్తున్న వ్యక్తులు  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top