2 లక్షల మంది రోహింగ్యాల ర్యాలీ

2 lakhs Rohingya rally in bangladesh - Sakshi

కుటుపలోంగ్‌: మయన్మార్‌ బలగాల దాడుల నుంచి తప్పించుకుని పారిపోయి రెండేళ్లయిన సందర్భంగా బంగ్లాదేశ్‌లోని కుటుపలోంగ్‌ శరణార్థి శిబిరంలో ఉంటున్న దాదాపు 2 లక్షల మంది రోహింగ్యాలు అక్కడే ర్యాలీ చేపట్టారు. 2017 ఆగస్టులో మయన్మార్‌లోని రఖినే రాష్ట్రం నుంచి 7.4 లక్షల మంది రోహింగ్యాలు బయటకు వెళ్లిపోయారు.

అంతకుముందే మయన్మార్‌ నుంచి వచ్చిన మరో 2 లక్షల మంది రోహింగ్యాలు ఆగ్నేయ బంగ్లాదేశ్‌లోని శిబిరాల్లో ఉంటున్నారు. వారికి ఈ 7.4 లక్షల మంది కూడా జతకలిశారు. ఆదివారం జరిగిన ర్యాలీలో హత్యాకాండ దినం సందర్భంగా చిన్నారులు, మహిళలు కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ‘దేవుడు గొప్పవాడు. రోహింగ్యాలు వర్ధిల్లాలి’ అంటూ వారంతా నినాదాలు చేశారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top