గడ్డం తీసుకున్నారో రూ.6700 ఫైన్! | $100 for shaving beard: ISIS imposes new fines, taxes | Sakshi
Sakshi News home page

గడ్డం తీసుకున్నారో రూ.6700 ఫైన్!

May 30 2016 6:26 AM | Updated on Oct 2 2018 4:31 PM

గడ్డం తీసుకున్నారో రూ.6700 ఫైన్! - Sakshi

గడ్డం తీసుకున్నారో రూ.6700 ఫైన్!

ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఆధిపత్యం ఉన్న ప్రాంతాల్లో మరోసారి పన్నుల మోత మోగింది. ఎవరైనా గడ్డం గీసుకున్నా.. మహిళలు బిగుతుగా వస్త్రాలు ధరించినా భారీ మొత్తంలో పన్ను చెల్లించాల్సిందని తాజాగా ఆదేశాలు జారీ చేసినట్లు ఓ అధ్యయనం ఒకటి చెప్పింది.

వాషింగ్టన్: ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఆధిపత్యం ఉన్న ప్రాంతాల్లో మరోసారి పన్నుల మోత మోగింది. ఎవరైనా గడ్డం గీసుకున్నా.. మహిళలు బిగుతుగా వస్త్రాలు ధరించినా భారీ మొత్తంలో పన్ను చెల్లించాల్సిందని తాజాగా ఆదేశాలు జారీ చేసినట్లు ఓ అధ్యయనం ఒకటి చెప్పింది. వారి ఆదేశాల ప్రకారం ఇక నుంచి ఎవరైనా పురుషుడు గడ్డం గీసుకుంటే దాదాపు రూ.6వేలకు పైగా చెల్లించాల్సి ఉంటుంది.

ఒక వేళ ఎవరైన మహిళ బిగుతుగా ఉండే వస్త్రాలు ధరిస్తే దాదాపు రూ.2 వేలు ఫైన్ చెల్లించాలి. ప్రస్తుతం ఇస్లామిక్ స్టేట్ చాలా సమస్యలు ఎదుర్కుంటోంది. అందులో ఆర్థికపరమైన సమస్యది అగ్రభాగం. వారి జీవన మనుగడతోపాటు విపరీతమైన ఆయుధాలు ఉపయోగించే ఈ సంస్థకు ఇటీవల తీవ్రంగా ఆర్థికంగా లోటు ఉంది. ఈ నేపథ్యంలో వివిధ రూపాల్లో పన్ను వేసి అమాయకుల నుంచి భారీ మొత్తం సొమ్మును ముక్కు పిండి వసూలు చేయాలనుకుంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement