వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి సమావేశమయ్యారు.
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి సమావేశమయ్యారు. తమిళనాడులో తెలుగు ప్రజల సమస్యల పోరాటానికి మద్దతు ఇవ్వాల్సిందిగా ఆయన వైఎస్ జగన్ను కోరారు.
తమిళనాడులో పాఠశాలల్లో తెలుగుభాషను తొలగించడంపై గురువారం ఇందిరాపార్క్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్టు జగదీశ్వర్ రెడ్డి చెప్పారు. ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొని తమకు మద్దతు ఇవ్వాలని వైఎస్ జగన్ను కోరారు. తమిళనాడులో తెలుగువారి సమస్యల పోరాటానికి వైఎస్ఆర్ సీపీ పూర్తి మద్దతు ఇస్తుందని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.