'జర్నలిజాన్నిదిగజార్చిన ఘనత ఆయనదే' | ysrcp leader vasireddy padma fires on cm chandrababu naidu | Sakshi
Sakshi News home page

'జర్నలిజాన్నిదిగజార్చిన ఘనత ఆయనదే'

Nov 26 2015 6:23 PM | Updated on Jul 28 2018 3:30 PM

'జర్నలిజాన్నిదిగజార్చిన ఘనత ఆయనదే' - Sakshi

'జర్నలిజాన్నిదిగజార్చిన ఘనత ఆయనదే'

రాజ్యాంగ ఆమోద దినోత్సవం నాడే రాజ్యాంగాన్ని, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అవమానిస్తున్నారని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు.

హైదరాబాద్: రాజ్యాంగ ఆమోద దినోత్సవం నాడే రాజ్యాంగాన్ని, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అవమానిస్తున్నారని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. మీడియాపై చంద్రబాబు అసహనం ప్రదర్శిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. పాకిస్థాన్ లో మాదిరిగా ఒక ఛానల్, పత్రిక చూడొద్దని చంద్రబాబు ఫత్వా జారీ చేస్తున్నారని ధ్వజమెత్తారు.

హైదరాబాద్ లోటస్పాండ్లో వైఎస్ఆర్ సీపీ ప్రధాన కార్యాలయంలో ఆమె గురువారం విలేకరులతో మాట్లాడారు. జర్నలిజాన్ని పెయిడ్ జర్నలిజంగా దిగజార్చింది చంద్రబాబేనని ఆమె విమర్శించారు. టీడీపీ నేతల ఇసుక మాఫియాపై అన్ని మీడియాల్లో కథనాలు వచ్చాయని, హైకోర్టు కూడా చివాట్లు పెట్టిందని వాసిరెడ్డి పద్మ గుర్తుచేశారు. మీ అవినీతిని ప్రశ్నించడం సాక్షి చేసిన తప్పా? అని ఆమె చంద్రబాబును నిలదీశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement