హెరిటేజ్ ఆవులు బంగారు పాలు ఇస్తున్నాయా? | ysrcp leader ambati rambabu asks heritage cow gives golden Milk? | Sakshi
Sakshi News home page

హెరిటేజ్ ఆవులు బంగారు పాలు ఇస్తున్నాయా?

Sep 29 2015 7:17 PM | Updated on May 25 2018 7:29 PM

హెరిటేజ్ ఆవులు బంగారు పాలు ఇస్తున్నాయా? - Sakshi

హెరిటేజ్ ఆవులు బంగారు పాలు ఇస్తున్నాయా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు సవాల్ విసిరారు.

హైదరాబాద్  : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు సవాల్ విసిరారు. నారా లోకేష్ ప్రకటించిన ఆస్తులపై  చంద్రబాబు విచారణకు సిద్ధమా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఇండిపెండెంట్ ఆడిటర్ లేదా రిటైర్డ్ జడ్జితో విచారణకు సిద్ధమా అని అంబటి రాంబాబు మంగళవారమిక్కడ డిమాండ్ చేశారు.


మీ ఆస్తుల విలువ నిజమైతే ఈ ఛాలెంజ్ స్వీకరించాలని సూచించారు. పాలు, కూరగాయలు అమ్మి కోట్లు గడించేవారు ఉన్నారా అని అంబటి ప్రశ్నలు సంధించారు. హెరిటేజ్ ఆవులు ఏమైనా బంగారు పాలు ఇస్తున్నాయా? అని ఆయన ఎద్దేవా చేశారు. లోకేశ్ ప్రకటించిన ఆస్తుల లెక్కలను కనీసం వాళ్ల కుటుంబ సభ్యులు గానీ, నందమూరి వంశంలో వాళ్లు గానీ, వాళ్ల పార్టీ కార్యకర్తలు గానీ ఎవరూ నమ్మడం లేదని అంబటి వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement