కుషాయిగూడలో మహిళ దారుణ హత్య | women murdered in hyderabad | Sakshi
Sakshi News home page

కుషాయిగూడలో మహిళ దారుణ హత్య

Oct 27 2016 3:40 PM | Updated on Sep 4 2017 6:29 PM

పది రోజుల క్రితం అదృశ్యమైన మహిళ.. శవమై కనిపించింది. కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.

హైదరాబాద్: పది రోజుల క్రితం అదృశ్యమైన మహిళ.. శవమై కనిపించింది. కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. అశోక్‌నగర్‌కు చెందిన పద్మ(40) గత పది రోజులుగా కనిపించకుండాపోయింది. దీనిపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం ఉదయం డీఏ కాలనీలోని నిర్మానుష్య ప్రదేశంలో ఆమె శవమై కనిపించింది. స్థానికుల సమాచారంతో అక్కడికి వెళ్లి పరిశీలించిన కుటుంబసభ్యులు పద్మగా గుర్తించారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను చంపి అక్కడ పడేసి ఉంటారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement